Skip to main content

Jagananna Vidya Deevena: తిరుపతిలో 35,312 మంది తల్లులు.. రూ.29.23కోట్లు!

తిరుపతి అర్బన్‌: కలెక్టరేట్‌లో సోమవారం జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 35,312 మంది తల్లుల ఖాతాల్లో రూ.29.23 కోట్లు జమచేసినట్టు అధికారులు వెల్లడించారు.
JVV-Tirupati

నగరి నుంచి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించగా.. అదే సమయంలో కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బల్లి కళ్యాణ్‌చక్రవర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. విద్యార్థులు సీఎం ప్రసంగాన్ని వీక్షిస్తూ..చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు.

APPSC Group 1 Ranker: నా విజ‌యం వెనుక ఉన్న‌ది వీళ్లే.. ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా..

అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంన్నారు. జేసీ మాట్లాడుతూ మూడవ త్రైమాసికం (ఏప్రిల్‌ 23–జూన్‌23) జగనన్న విద్యా దీవెన ఆర్థిక సాయాన్ని తల్లుల ఖాతాల్లో జమచేసినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా విద్యార్థుల చదువు కోసం పెట్టే డబ్బు ఖర్చు కాదని, వారి భవిష్యత్‌కు పెట్టుబడి అని చెప్పారు. అనంతరం మెగా చెక్కును ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నా పేరు లిఖిత. నేను శ్రీవేంకటేశ్వర ద్వారకా కాలేజ్‌లో బీబీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ నన్ను, మా తమ్ముడు, చెల్లెల్ని చదివిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం బాధనిపించింది. అదేసమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకం నా చదువుకు ఆటంకం కాకుండా ఎంతో ఉపయోగపడుతోంది.


నా పేరు తనూష. నేను ఎస్టీహెచ్‌ఆర్‌ కాలేజ్‌లో బీసీఏ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాను. నా ఊరు గుంతకల్లు. నేను డిగ్రీ చదువుకోడానికి తిరుపతికి వచ్చి హాస్టల్లో ఉంటున్నాను. మాది చాలా నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు మేస్త్రి పనిచేస్తూ నన్ను నా చెల్లెలిని చదివిస్తున్నారు. నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందడం వల్లే డిగ్రీ పూర్తి చేసుకోగలుగుతున్నాను. సీఎం జగన్‌ మామయ్యకి ధన్యవాదాలు.


NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్‌ సీట్లు.. కార‌ణం ఇదే..

Published date : 29 Aug 2023 05:05PM

Photo Stories