Basara Triple IT: ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో ముఖాముఖి
Sakshi Education
భైంసా(ముధోల్): బాసర ట్రిపుల్‌ఐటీలో చదువుతు న్న 25 మంది విద్యార్థులు అక్టోబర్ 12 గురువారం నిజామాబా ద్‌లోని ఐటీటవర్స్‌లో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ సలహాదారులు డాక్టర్ వెంకట్‌మట్టెల, శ్రీధర్‌తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకుని విజయవంతమైన వ్యాపార వ్యవస్థాపకులుగా ఎలా ఎదగాలి, వ్యాపారాలు విజయవంతంగా నిర్వహించుకునే లక్షణాలు ఎలా అలవర్చుకోవాలనే విషయాలను వివరించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈసెల్ కన్వీనర్ రాకేశ్‌రెడ్డితో పాటు ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: Tribal students: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి
Published date : 14 Oct 2023 11:30AM