Tribal students: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి
ఎస్‌ఎస్ తాడ్వాయి : గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం అన్నారు. అక్టోబర్ 12 గురువారం మండలంలోని మేడారం ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో డివిజన్ స్థాయి గిరిజన బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం సరోజన అధ్యక్షతన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, డీడీ పోచం, ఏటీడీఓ దేసిరాం నాయక్ హాజరయ్యారు. ఈసందర్భంగా డీడీ పోచం మాట్లాడుతూ.. గిరిజన స్థాయి క్రీడా పోటీలు ఒక రోజులో పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. డిసెంబర్‌లో ఆశ్రమ పాఠశాలలో పలు క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం క్రీడ నిర్వహణ అధికారి, పీజీ హెచ్‌ఎం కల్తి శ్రీనివాస్ మాట్లాడుతూ.. డివిజన్ స్థాయి క్రీడలకు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు విద్యార్థులకు ప్రోత్సాహంగా రూ.50వేల సాయం అందించారని తెలిపారు. మేడారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలను 100 మంది నుంచి 600 మంది విద్యార్థుల స్థాయి వచ్చేలా సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం ఎంతో కృషి చేసిందన్నారు. డీడీ పోచం కూడా జగ్గారావును అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డివిజన్ స్థాయి 14–17సంవత్సరాల క్రీడల ఎంపిక పోటీలకు నాలుగు మండలాల్లోని 16 ఆశ్రమ పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి యాలం ఆదినారాయణ, సమ్మక్క పూజారి సిద్దబోయిన స్వామి, డిప్యూటీ వార్డెన్ ఆశ్విని, పీడీ గడ్డం లక్ష్మీనారాయణ, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.
చదవండి: Free Training: స్వయం ఉపాధితోనే భవిత పదిలం
జాతీయ స్థాయిలో రాణించాలి
ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులు క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించాలని ఐటీడీఏ డీడీ పోచం అన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో 14, 17 సంవత్సరాల బాలికలలకు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో ఏటూరునాగారం డివిజన్ స్థాయి ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా పోచం మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడతాయని అన్నారు. గిరిజన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 8 పాఠశాలలకు చెందిన 350 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.కార్యక్రమంలో ఏసీఎంఓ కోడి రవీందర్, హెచ్‌ఎం రేవతి, సారంగపాణి, పీడీ, పీటీలు తదితరులు పాల్గొన్నారు.