Indian universities In Top 500 QS Rankings: భారత్‌కు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలకు టాప్-50 ర్యాకింగ్స్‌లో చోటు
ఇండియన్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా టాప్-50 స్థానాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM)కు చెందిన మూడు విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. Quacquarelli Symonds (QS)విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..టాప్ 500 విశ్వవిద్యాలయాల్లో, 69 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉండటం విశేషం.
ఈ జాబితాలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా టాప్-20 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ,యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ,ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE) సహా పలు విశ్వవిద్యాలయాలు వివిధ విభాగాల్లో టాప్-100 స్థానాల్లో మెజారిటీని సాధించాయి.
అత్యధికంగా ఢిల్లీ యూనివర్సిటీకి 30 ఎంట్రీలు రాగా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IITB)కి 28 ఎంట్రీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT-KGP)కు 27 ఎంట్రీలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ డెంటిస్ట్రీ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 24వ స్థానంలో నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో చైనాకు చెందిన 101 విశ్వవిద్యాలయాలు టాప్ 500లో చోటు దక్కించుకోగా, ఆ తర్వాత భారత్ 69 విశ్వవిద్యాలయాలతో నాల్గవ స్థానంలో ఉంది. అకడమిక్స్, యూనివర్సిటీ విధానం, H-ఇండెక్స్ సహా మరికొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని QS ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే భారత్ 19.4%తో గణనీయమైన పురోగతిని కనబరిచింది