Skip to main content

Indian Students Drown In River: విషాదం.. రష్యాలో నలుగురు భారత వైద్య విద్యార్థులు మృతి

Indian Students Drown In River

మాస్కో: రష్యాలో విషాదం జరిగింది. భారత్‌కు చెందిన ముగ్గురు వైద్య విద్యార్థులు సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ సమీపంలోని నదిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. నలుగురిలో ఒక విద్యార్థి మృతదేహాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. చనిపోయిన నలుగురిలో ఇద్దరు అమ్మాయిలు కాగా ఇద్దరు అబ్బాయిలు. 

వీరంతా సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ సమీపంలోని నోవ్‌గొరోడ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత నీటిలో మునిగిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడానికి మిగిలిన నలుగురు స్నేహితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు నదిలో కొట్టుకుపోగా ఒక విద్యార్థిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు. 

NEET UG 2024 Topper Sad Story : నీట్ యూజీ-2024 టాప‌ర్‌.. కానీ విధి ఆడిన వింత నాట‌కంలో అనారోగ్యంతో..

విద్యార్థుల మృతదేహాలను వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌(ట్విటర్‌)లో తెలిపింది. మృతి చెందిన విద్యార్థులు మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాకు చెందిన వారు. 

Published date : 07 Jun 2024 01:40PM

Photo Stories