Education for Students: విద్యను అభ్యాసిస్తూ క్రమశిక్షణతో ఉండాలి..
సాక్షి ఎడ్యుకేషన్: టీటీడీ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో అదృష్టవంతులని, ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో విద్యనభ్యసించినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని ఈఓ ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన స్టూడెంట్స్ సక్సెస్ మీట్ – అఛీవర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అకడమిక్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో–కరికులర్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్లేస్మెంట్స్ తదితర విభాగాల్లో అత్యత్తుమ ప్రతిభ కనబరిచిన 215 మంది విద్యార్థులకు 5 గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రాలను అందజేశారు.
Entrance Exam: ఇంటర్ దరఖాస్తులకు ఆహ్వానం.. ఇదే చివరి తేదీ..!
అనంతరం ఈఓ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని 27 విద్యాసంస్థల విద్యార్థులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి అవార్డులు అందించడం ఎంతో సంతోషకరమన్నారు. అధ్యాపకులు విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో రాజీ పడొద్దని సూచించారు. అవసరమైతే వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. త్వరలో 120 మంది జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామకానికి చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. టీటీడీ జేఈఓ సదాభార్గవి మాట్లాడుతూ విద్యను కొనకూడదు.. అమ్మకూడదు అనే మహోన్నత లక్ష్యంతో టీటీడీ విద్యాసంస్థలను నిర్వహిస్తోందని తెలిపారు. ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణిసదాశివమూర్తి మాట్లాడుతూ శారీరక వికాసం కోసం క్రీడలు, యోగా సాధన చేయాలని సూచించారు.
College Students: విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రణాళిక
టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఒకే మేనేజ్మెంట్ ఆధ్వర్యంలోని మూడు కళాశాలలకు న్యాక్–ఏ ప్లస్ గ్రేడ్‌తో పాటు అటానమస్ హోదా రావడం చరిత్రాత్మకమన్నారు. ఏపీఆర్‌ఓ పీ.నీలిమ, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణవేణి, ఎస్వీ సంగీత కళాశాల హరికథ విభాగం అధ్యాపకులు వెంకటేశ్వర్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. టీటీడీ ముఖ్య గణాంకాధికారి శేషశైలేంద్ర, టీటీడీ విద్యావిభాగం సలహాదారు ఎల్‌ఆర్.మోహన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.