New Medical College: రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల... ఎక్కడంటే
Sakshi Education
పులివెందుల కేంద్రంగా రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలను నెలకొల్పారు. ప్రారంభోత్సవానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన కళాశాలలు ఇప్పటికే ప్రారంభించారు.
రూ.32.82 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేశారు. రూ.39 కోట్లతో డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ గార్డన్, రూ.69 కోట్లతో ఉలిమెల్ల చెరువు సుందరీకరణ పూర్తి కానున్నాయి. రూ.24కోట్లతో ఆర్టీసీ బస్టాండ్, డిపో ఏర్పాటు చేశారు. భూగర్భ డ్రైనేజీ, రహదారుల విస్తరణ, నూతన రోడ్లు ఏర్పాటు చేపట్టారు.
NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష రీషెడ్యూల్ తేదీ ఇదే..
రూ.5.60 కోట్లతో పార్నపల్లె వద్ద చిత్రావతి జలాశయంలో బోటింగ్ సౌకర్యం కల్పించారు. ఆధునాతన పార్క్‌లు, సుందరంగా రహదారులు, రింగ్‌రోడ్ల సర్కిళ్లు తీర్చిదిద్దారు. ఒక్కమాటలో చెప్పాలంటే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌లో జిల్లాలో ప్రగతి నలుచెరుగులా విస్తరించిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Top Don'ts for NEET 2024: నీట్ కి ప్రిపేర్ అవుతున్నారా... ఇవి అస్సలు చేయకండి!
Published date : 19 Jan 2024 12:36PM