Education for Women: బాలికా విద్యకు ప్రభుత్వ ప్రోత్సాహం
చింతపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బాలికా విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిశు సంక్షేమశాఖ పీడీ సూర్యలక్ష్మి కోరారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బాల్యవివాహాల నిరోధంపై మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో డివిజన్‌స్థాయి సదస్సులో ఆమె మాట్లాడారు. చదువుతోనే గిరిజన బాలికల ప్రగతి ముడిపడి ఉందన్నారు.
Students Health: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఉన్నత చదువుల వరకూ ప్రభుత్వం బాలికా విద్యను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో బాల్యవివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బాల్యవివాహాలకు సంబంధించిన సమాచారం ఉంటే తక్షణమే అంగన్‌వాడీ సిబ్బంది, మహిళా పోలీసులకు చేరవేయాలన్నారు.
10th Class Results: ‘పది’ ఫలితాల్లో ముందంజలో ఉండాలి
జెడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పోత్సాహకాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ తహసీల్దారు రాజ్‌కుమార్, ఎంపీడీవో వీరసాయిబాబు, ఎంఈవో ప్రసాద్, ఏటీడబ్ల్యూవో జయలక్ష్మి, ఐసీడీఎస్ పీవో రమణి, సూపర్‌వైజర్ విజయ, చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన ఐసీడీఎస్ అధికారులు, సచివాలయ పోలీసులు పాల్గొన్నారు.
Nuclear Power Plant on Moon: చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం.. 2035 నాటికి..
Tags
- girl child education
- government encouragement
- Department of Women and Child Welfare
- Division level conference
- surya lakshmi
- women education
- prevention of child marriages
- Education News
- Sakshi Education News
- alluri seetaramaraju news
- State government
- girl child education
- Tribal girls
- Child welfare department
- sakshieducation updates