Skip to main content

Students Health: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ఆశ్రమ పాఠశాలని తనిఖీ చేసిన పాడేరు ఐటీడీఏ పీఓ అభిషేక్‌ విద్యార్థులకు అందుతున్న భోజనం, వారి ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న శ్రద్ధ గురించి తెలుసుకున్నారు. అక్కడి యాజమాన్యానికి ఈ విషయంపై ఆదేశాలిచ్చారు.
Attention to student health at ashram school   Safety measures and Care towards students health   Abhishek inspecting ashram school meals

జి.మాడుగుల: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహిస్తే చర్యలు తప్పవని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్‌ హెచ్చరించారు. మండలంలో కె.కోడాపల్లి పంచాయతీ బందవీధి ప్రభుత్వం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో వంటగదిని తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ మాత్రమే అందించాలని ఆయన ఆదేశించారు.

State Level Competitions: రాష్ట్రస్థాయికి ఎంపికైన జిల్లా విద్యార్థుల ప్రాజెక్టులు..

ప్రతి రోజూ బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలలో సిక్‌ రూమ్‌లో ఉన్న 8వ తరగతి విద్యార్థిని వెంకటలక్ష్మితో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమెకు వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించాలని హెచ్‌ఎంకు సూచించారు. పాఠశాలలో నీరసంగా ఉన్న ఐదుగురు విద్యార్తులను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఏటీడబ్ల్యూవో తిరుపాల్‌ పాల్గొన్నారు.

High Court: ఈ తరగతులకి పబ్లిక్‌ పరీక్షలు లేనట్టే

Published date : 07 Mar 2024 03:01PM

Photo Stories