Students Health: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
పాడేరు: ఏజెన్సీ 11 మండలాల పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని ఐటీడీఏ పీవో వి. అభిషేక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే నిర్వాహకులు నిర్లక్ష్యం చేయకుండా సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తీసుకువెళ్లి సత్వర వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
Posts at Medical College: పొరుగు సేవలకు ఉద్యోగుల తాత్కాలిక జాబితా విడుదల..
ఆస్పత్రిలో వైద్యుల సూచన మేరకు పాడేరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలిస్తున్నారని అక్కడ కూడా పూర్తి స్థాయిలో నయం కాకపోతే విశాఖ కేజీహెచ్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు విశాఖపట్నం కేజీహెచ్‌లో ట్రైబల్ సెల్ వైద్యులు, సిబ్బంది విశేష కృషి చేస్తున్నారన్నారు. విద్యార్ధులకు అవసరమైన మందులు కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. రక్తం అవసరమైన విద్యార్థులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా సరఫరా జరుగుతోందన్నారు. ఇప్పటికే అన్ని మండలాల ఏటీడబ్ల్యూవోలు, హెచ్‌ఎంలు, డిప్యూటీ వార్డెన్లతో సమావేశం నిర్వహించి విద్యార్ధులకు అందించాల్సిన మెనూ, ఆరోగ్యంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు పీవో పేర్కొన్నారు.
Job Mela: మార్చి 1వ తేదీ జాబ్‌మేళా.. సద్వినియోగం చేసుకోండి
జువైనల్ జస్టిస్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల లోపల బయట వ్యక్తుల ప్రవేశం లేదన్నారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను నిత్యం తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల గిరిజన సంక్షేమ సహాయ అధికారులను ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.