Skip to main content

Job Mela: మార్చి 1వ తేదీ జాబ్‌మేళా.. స‌ద్వినియోగం చేసుకోండి

పార్వతీపురం: పాలకొండలో మార్చి 1వ తేదీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్ తెలిపారు.
Encouraging Unemployed Youth to Participate   Representatives from 13 Companies Offering Various Job Opportunities  Job Mela at Sri sathya sai degree college in Palakonda  Job Fair Announcement in Parvathipuram

ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయంలో జాబ్‌మేళా పోస్టర్‌ను ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాలకొండలోని శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా  నిర్వహించనున్నారు. ఇందులో ఐటీ, ఫార్మా, హెల్త్‌, బ్యాకింగ్‌, మ్యానిఫ్యాక్చరింగ్‌, ఆటోమేటివ్‌, ఎలక్ర్టానిక్స్‌ తదితర 13 కంపెనీల‌ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఎంపిక చేయ‌నున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వివరాలు స్కిల్‌యూనివర్స్‌.ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 63012 75511,70320 60773,79937 95796 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు, ఆర్డీఓ కె.హేమలత, జిల్లా పరిశ్రమల అధికారి కరుణాకర్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జేఎల్‌ఎన్‌ మూర్తి, నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

TS Intermediate Exams 2024: రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు..ఈ విషయాలు మర్చిపోవద్దు

Published date : 27 Feb 2024 12:27PM

Photo Stories