Skip to main content

Golden future with education: చదువుతో బంగారు భవిష్యత్‌

Golden future with education

గార్లదిన్నె/పామిడి/గుత్తి/గుత్తి రూరల్‌/ గుంతకల్లు రూరల్‌: విద్యార్థులు బాగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఏపీ స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌ విజయప్రతాప్‌రెడ్డి సూచించారు. విద్యార్థులకు చదువే ఆస్తి కావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, బోధన ప్రమాణాలు మెరుగుపరిచారన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. చైర్మన్‌ రెండు రోజుల జిల్లా పర్యటన ముగిసింది. మంగళవారం గార్లదిన్నె కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, ఇందిరమ్మ కాలనీ, బీసీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కేజీబీవీలో చదువుకున్న విద్యార్థిని నిఖిల ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీటు సాధించడం అభినందనీయమన్నారు. గార్లదిన్నె ఇందిరమ్మ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు మెరుగైన విద్యాబోధనతో పాటు, రుచికరమైన భోజనం అందించిన అంగన్‌వాడీ సిబ్బందిని శాలువాతో సత్కరించారు. ఒకొక్కరికి రూ.1000 చొప్పున నగదు ప్రోత్సాహం అందించి అభినందించారు.

Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

మధ్యాహ్న భోజనం సంతృప్తికరం
పామిడి టీసీ హైస్కూల్‌ను ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తనిఖీ చేశారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే కోడిగుడ్లు నిర్దేశిత బరువు ఉన్నాయా లేదా అని తూకం వేసి చూశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం 15తో పాటు 17వ కేంద్రాన్ని పరిశీలించారు. టీహెచ్‌ఆర్‌ పంపిణీపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

Free Education: విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయం’

మెనూ పక్కాగా పాటించాలి
మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పక్కాగా పాటించాలని చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. గుత్తి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం పెట్టకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దాసరి కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ తర్వాత రజాపురం డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, సేవాగఢ్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడి నుంచి గుంతకల్లు కేజీబీవీ., బీసీ బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎస్‌ఓ శోభారాణి, డీఈఓ సాయిరామ్‌, డీసీఓ మురళీకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, ఆర్డీఓ రవీంద్ర, సీడీపీఓలు ఉమాశంకరమ్మ, డిల్లీశ్వరి, తహసీల్దార్లు ఉషారాణి, ఆర్‌.వి.సునీతాబాయి, మహబూబ్‌బాషా, ఎంపీడీఓలు ప్రభాకర్‌నాయక్‌, ఎంఈఓలు జయానాయక్‌, రవినాయక్‌ పాల్గొన్నారు.
 

Published date : 09 Aug 2023 02:32PM

Photo Stories