Free Short Video Contest on Simple Math Tricks: టాప్ వీడియోలు సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానెల్‌లో!!
కాంటెస్ట్: సింపుల్ మ్యాథ్ ట్రిక్స్‌పై షార్ట్ వీడియో
ఎవరు పాల్గొనవచ్చు?
ఈ పోటీలో ఉచితంగా పాల్గొనచ్చు. గణితం మరియు సాధారణ గణిత ట్రిక్స్‌పై ఆసక్తి ఉన్న ఎవరైనా పోటీలో పాల్గొనడానికి అర్హులు.
ఎలా పాల్గొనాలి?
సింపుల్ మ్యాథ్ ట్రిక్ ను వివరిస్తూ వీడియో ట్యుటోరియల్‌ని రికార్డు చేయండి. వీడియో నిడివి 5 నిమిషాల కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. పోటీలో పాల్గొనేవారు తమ పేరు, ఇమెయిల్, ఫోన్ నంబర్, పాఠశాల పేరు, స్థలం మరియు రాష్ట్రంతో నమోదు చేసుకోవాలి. https://forms.gle/2eUbZuGfZ1Axnmpx6 లింక్ ద్వారా మీ రికార్డ్ చేసిన వీడియోను అప్‌లోడ్ చేయండి.
పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ: డిసెంబర్ 25, 2023.
పోటీలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. టాప్ 5 వీడియోలను రికార్డు చేసిన అభ్యర్థుల పేర్లు మరియు ఫోటోలను sakshi.com మరియు sakshieducation.comలో ప్రచురించబడతాయి.
2. ప్రశంస/పార్టిసిపేషన్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది.
3. సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయబడతాయి.