National Mathematics Day: ఘనంగా గణిత దినోత్సవ వేడుక
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : మన భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన గణిత మేధావి రామానుజన్ శ్రీనివాస రామానుజన్. ఈయన జన్మదినంను ఏటా డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ సందర్భంగా అత్తపూర్‌లో భాష్యం పాఠశాలలో 'ఎడ్యు ఎక్స్‌పో 2022-23' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు రకరకాల ప్రదర్శనలతో వారి ప్రతిభను కనబరిచారు. అలాగే విద్యార్థుల మేథోశక్తిని పెంపొందించే దిశగా రామానుజన్ టెస్ట్ ను కూడా నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపల్ అయూబ్ బాషా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్స్ సీఈఓ చైతన్య, జేఈఓ అంకమ్మరావు పాల్గొని విద్యార్థులను అభినంధించారు.
Published date : 22 Dec 2022 08:45PM