AP Schools Holidays : రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు.. వచ్చే 4 రోజులపాటు..
వచ్చే 4 రోజులపాటు వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
డిసెంబర్ 4, 5 తేదీల్లో..
ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో డిసెంబర్ 4, 5 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గాలి ఉద్ధృతంగా వీస్తుందని హెచ్చరించారు. గంటకు 95 నుంచి 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అన్ని శాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది జిల్లా ప్రజలకు అందుబాటులో వుండాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆయన అలర్ట్ చేశారు.’మైచౌంగ్’ తుఫానుగా నామకరణం చేశారు. తుఫాను ఈ నెల 4న నెల్లూరు–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో అధికారులంతా సన్నద్ధంగా వుండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే వాటిని వెంటనే పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, అందులో తాగునీరు, ఆహారం, పాలు వంటివి అందుబాటులో వుంచుకోవాలని సూచించారు. అలాగే వైద్య సేవలను కూడా అందజేపయాలని తెలిపారు.
అటు మైచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140కి పైగా రైళ్లను డిసెంబర్ 3 నుంచి 6 వ తేదీ వరకు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. మరికొన్నింటినీ పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో అలలు ఎగసిపడుతున్నాయి.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో డిసెంబర్ 4, 5వ తేదీల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సెలవు ప్రకటించారు. అలాగే ఇతర జిల్లాల్లో తుపాన్ తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 4వ తేదీన సోమవారం అన్ని సూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అవసరం అయితే డిసెంబర్ 5వ తేదీన కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.
☛ కింది లింక్‌ను క్లిక్ చేయండి
☛ Link: www.whatsapp.com/channel/0029VaAEFp03wtbAEo43FG1k (Click Here)
Tags
- due heavy rain ap schools and colleges holidays
- due heavy rain schools holidays
- due heavy rain colleges holidays
- AP Schools Holidays
- heavy rain ap colleges holidays
- Heavy Rains Lash Nellore
- Holiday for Schools and Colleges Tomorrow
- Heavy Rains Lash prakasam Holiday for Schools and Colleges Tomorrow
- Andhra Pradesh Weather Update
- Heavy Rain Warning
- Sakshi Education News
- Bay of Bengal Storm
- Weather Emergency
- Four Days of Rains
- Meteorological Alert
- Nellore District
- prakasam district
- Severe Weather Advisory
- Sakshi Education Latest News