Skip to main content

Students suicide: పిల్లలపై మీ కోరికలు రుద్దకండి... చేతులారా ఎందుకు చంపుకుంటారు

తల్లిదండ్రుల కోరికలు పిల్లలపై రుద్దే ప్రయత్నం చేయొద్దని, విద్యార్థులకు ఇష్టమైన కోర్సుల్లోనే చేర్పించాలని ప్రముఖ సైకాలజిస్ట్‌ ఏపీజే విను చెప్తున్నారు. ప్రస్తుతం యువతలో పెరుగుతున్న ఆత్మహత్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Student Suicides

తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటిస్తే ఆత్మహత్యలను నివారించొచ్చని అంటున్నారు.

తెలుగురాష్ట్రాల్లో పెరిగిపోతున్న సంఖ్య....
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. నేషనల్‌ క్రైం బ్యూరో రిపోర్ట్‌ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇలా ఆత్మహత్య చేసుకునే వారిలో విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. కాలేజీ హాస్టళ్లలో ఉరి వేసుకుని తనువు చాలిస్తున్నారు. చదువులో ఒత్తిడిని తట్టుకోలేకే పిల్లలు బలవన్మరణాలకు పాల్పడుతురన్నారు. 

చ‌ద‌వండి: దూసుకెళుతోన్న చాట్‌జీపీటీ... 20 నిమిషాల్లో 2 వేల పదాలతో ఎస్సే రాసి రికార్డ్‌..!

బ్యాక్ లాగ్స్ ఉంటే ఏమవుతుంది
తల్లిదండ్రులు ఫస్ట్‌ తమ పిల్లలను ఇతరులతో పోల్చి చూడడం ఆపేయాలి. పక్కింటి పిల్లాడికి అన్ని మార్కులు వచ్చాయి.. అక్కడ సీటొచ్చింది... నీకు ఎందుకు రావట్లేదు.. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మన చేతికి ఉంటే ఐదు వేళ్లు ఒకేలా ఉండవు. అలాగే పిల్లలు కూడా అంతే. ఒకరికి నాలెడ్జ్‌ ఎక్కువుంటే.. ఇంకొకరికి ఆ మేరకు ఉండకపోవచ్చు. అంతమాత్రాన వారిని కించపర్చకూడదు. పోల్చిచూడడం వల్లే విద్యార్థులకు చదువులపై విరక్తి వస్తుంది.

చ‌ద‌వండి: చాట్‌ జీపీటీకి గూగుల్ షాక్‌....బార్డ్‌తో చాట్‌జీపీటీకి చెక్‌..?

అన్ని సబ్జెక్టులు ఒకటే....
తెలుగు నుంచి సోషియల్‌ వరకు అన్ని సబ్జెక్టులు ఒక్కటే. కేవలం స్కోరింగ్‌ సబ్జెక్ట్‌లైన మ్యాథ్స్, సైన్స్‌పై ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టేలా చేయాలి. పిల్లలు ఇందులో కాకపోతే మరో రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. వారికంటూ కొన్ని ఇష్టాలుంటాయి. వాటికి విలువ ఇవ్వాలి.

DR Vinu

మీరు చేయలేకపోయిన వాటిని.. మీ పిల్లలు చేయాలనుకోవడం మంచిదే. కానీ, ఈ పేరుతో వారికి ఇష్టంలేని సబ్జెక్టులను వారిపై రుద్దే ప్రయత్నం చేయొద్దు. 

కేవలం ఫోకస్‌ పెట్టేలా చేయాలి
ప్రతి ఒక్కరూ టాపర్స్‌ అవలేరు. ఏ సబ్జెక్ట్‌లో మార్కులు తక్కువగా వస్తే దానిపై ఫోకస్‌ పెట్టి మంచి మార్కులు తెచ్చుకునేలా ఎంకరేజ్‌ చేయాలి. తల్లిదండ్రులే తక్కువ చేసి మాట్లాడడం వల్లనే.. అభద్రతాభావానికి గురవుతున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడి, సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతోనే మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

చ‌ద‌వండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్‌ చేస్తోన్న చాట్‌జీపీటీ

స్కిల్స్‌ కూడా ముఖ్యమే....
విద్యార్థులకు ఎంతసేపూ సబ్జెక్ట్‌ గురించే కాదు.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను కూడా నేర్పించాలి. అలాగే సమాజంలో జరుగుతున్న వాటి గురించి వివరించే ప్రయత్నం చేయాలి. జనరల్‌ నాలెడ్జ్‌ పెంచుకునేలా చేయాలి. అంతేగానీ, చిన్ననాటి నుంచే వారిని మొబైల్స్, టీవీలకు అతుక్కుపోయేలా చేయొద్దు. ఇంటర్‌ అవగానే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బీటెక్‌లు, డిగ్రీలు, ఎంబీబీఎస్‌లే కాదు.. వృత్తి విద్యా కోర్సులు చాలా ఉన్నాయి. మీ పిల్లలకు వాటిపై ఆసక్తి ఉంటే వాటిలో చేర్చించండి. ఫ్యాషన్‌ టెక్నాలజీ, మార్కెటింగ్‌ కోర్సులు... ఇలా ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలో వారిని ప్రోత్సహించాలి. చివరగా మీ పిల్లలను మాత్రం ఒత్తిడిలో పెంచకండి.. స్వేచ్ఛనివ్వండి. వారికి నచ్చే రంగంలోనే వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించండి.

Published date : 10 Feb 2023 06:42PM

Photo Stories