భారతీయ విజ్ఞాన వ్యవస్థకు స్వాలంబనే దిక్సూచి
భారతీయ విజ్ఞాన వ్యవస్థ మరియు స్వావలంబన, స్థిరమైన అభివృద్ధికి, దాని ప్రాముఖ్యత గురించి చర్చించడానికి విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, నిర్వాహకులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వక్తలు సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహా సంఘ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఆచార్య ఎన్.కిషన్, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహా సంఘ్ లక్ష్యాలను వివరిస్తూ భారతీయ విజ్ఞాన వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, నిర్వాహకులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో దాని పాత్రను నొక్కి చెప్పారు.
అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహా సంఘ్ జాతీయ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంత లక్ష్మణ్, భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే వామపక్ష ఉదారవాద మేధావుల దేశ వ్యతిరేక కథనాలను ఎదుర్కొనేలా విధానాలు అభివృద్ధి చేసి వాటిని సముచితంగా ప్రచారం చేయాల్సిన అవసరం గురించి మాట్లాడారు విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ కె మాధవీ లత మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి భారతీయ విద్యా వ్యవస్థలో భారతీయ విలువలు, శాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయులు అందించిన సేవలను పెంపొందించే ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఆమెరికా పాఠశాల విద్యావిధానం చిన్న వయస్సు నుండే దేశీయ విలువలు, విజయాలు, చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పుతారనీ, ఇలాంటి విధానాలు పిల్లలకు ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని పొందడంలో సహాయపడుతుందని అన్నారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ జే రావు ప్రాచీన భారతదేశ విజ్ఞాన విధానాలపై అవగాహనను పెంపొందించుకోవలసిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, తద్వారా ఎటువంటి ప్రతికూల కథనం మనపై ప్రభావం చూపదన్నారు. ప్రధాన వక్త, ఇన్ఫినిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రచయిత రాజీవ్ మల్హోత్రా మాట్లాడుతూ భారతీయ సామాజిక విలువలు, సంస్కృతి, మతపరమైన సంప్రదాయాలు, సంస్థలను వక్రీకరించడానికి పశ్చిమ దేశాలలో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఉపయోగిస్తారో వివరించారు. ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్లు భారతదేశాన్ని మరొక వలసరాజ్యం చేయడానికి దోహదపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో కె అరవిందరావు, మాజీ డిజిపి, ప్రొ. భీమరాయ మేత్రి, డైరెక్టర్ IIM నాగ్పూర్, డాక్టర్ అనిల్ సహస్రబుధే, చైర్పర్సన్, NAAC మరియు NBA, సహా ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
ఇన్ఫినిటీ ఫౌండేషన్, ఇండియా హెడ్ ప్రొఫెసర్ విజయ విశ్వనాథం, ఇండిక్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు పాతూరి మరియు చాణక్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వినాయక్ రజత్ భట్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ మరియు నేటి ప్రపంచంలో దాని ఔచిత్యంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహా సంఘ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో ఆస్పీ నిర్వహించిన యంగ్ అకడమీషియన్స్ కార్క్లేవ్ విద్యావేత్తలు, విధాన రూపకర్తలు మరియు నిర్వాహకులకు ఒక వేదికను అందించింది. భారతీయ జ్ఞాన వ్యవస్థ స్వావలంబన మరియు స్థిరమైన అభివృద్ధి ప్రాముఖ్యత గురించి చర్చించింది. ఈ ఒక్కరోజు సమావేశంలో సుమారు 200 మందికిపైగా ఉపాధ్యాయులు మరియు పరిశోధకులు దక్షిణ భరత రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు.