Bobby Kataria Arrest: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బాబీ కటారియా అరెస్ట్, ఉద్యోగాల పేరుతో..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బాబీ కటారియా అరెస్ట్ అయ్యాడు. నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని విదేశాలకు మానవ అక్రమ రవాణా చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి తన ఫాలోవర్స్‌లో దాదాపు 33 మందిని విదేశాలకు అక్రమంగా పంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
AP New Medical colleges: కొత్త వైద్య కళాశాలలకు 380 పోస్టుల మంజూరు
కొంతమంది మానవ అక్రమ రవాణాదారులతో కలిసి ఉద్యోగాల పేరుతో ట్రాప్ చేసి వారి పాస్‌పోర్ట్‌లు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాడు. బాధితుల్లో 12 మందిని అర్మేనియాకు, ఇద్దరిని సింగపూర్‌కు, నలుగురిని బ్యాంకాక్‌కు, ముగ్గురిని కెనడాకు, 12 మందిని లావోస్‌కు పంపినట్లు కటారియా అంగీకరించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను ప్రకటిస్తూ కొన్నాళ్లుగా హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను నడిపేవాడు.
ఎవరైనా విదేశాలకు వెళ్లాలనే ఆసక్తితో కటారియాను సంప్రదిస్తే వారి వద్ద నుంచి భారీగా డబ్బులు దండుకొని, ముఖ్యమైన డాక్యుమెంట్లను తన వద్దే ఉంచుకొని బందీలుగా చేసుకున్నాడు. ఆ తర్వాత చట్టవిరుద్ధమైన అమెరికన్ సైబర్ ఫ్రాడ్ కార్యకలాపాలకు సహకరించాలని బాధితులను బలవంతం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Govt Exams June Month Calendar : జూన్ నెలలో జరగనున్న పరీక్షల షెడ్యూల్ ఇదే.. నెలంతా పరీక్షలే!
చివరికి అక్కడి నుంచి తప్పించుకొని ఇండియన్ ఎంబసీ అధికారులను సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాబీ కటారియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి రూ. 20 లక్షల నగదు, నాలుగు మొభైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని, ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని పేర్కొన్నారు.