Bill Gates Met postmaster: బెంగళూరు యువతి చేస్తున్న పనికి మంత్రముగ్ధులైన గేట్స్... ఎందుకంటే..!
పోస్ట్‌మాస్టర్ కె.కుసుమ కృషి అభినందనీయమని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసించారు. ఇటీవల బెంగళూరులో ఎందరో సామాజిక కార్యకర్తలను ఆయన కలిశారు.
ఇందులో భాగంగా పోస్ట్‌మాస్టర్ కుసుమనూ బిల్‌గేట్స్ కలిశారు. భారత్‌లో శరవేగంగా విస్తరించిన డిజిటల్ ఆర్థికాభివృద్ధిలో కుసుమ వంటివారు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తర్వాత ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
ఇవీ చదవండి: మరి కాసేపట్లో AP EAPCET 2023 సీట్ల కేటాయింపు..
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ఈ ఏడాది మార్చిలో భారత్‌లో పర్యటించారు. తన పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, సచిన్ టెండూల్కర్, విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తదితరులను కలిశారు.
అలాగే ఆయన ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సామాజిక కార్యకర్తలను కలిశారు. భారత్‌లో తన పర్యటన గురించి విస్తృతంగా మాట్లాడడంతో పాటు... తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. రెండు రోజుల కిందట లింక్డిన్ లో కుసుమతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
ఇవీ చదవండి: రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్... షేక్ అయేషా సక్సెస్ జర్నీ సాగిందిలా..!
"నా భారత పర్యటనలో మార్పు కోసం పరితపిస్తున్న ఓ శక్తిని కలిశాను. కుసుమ అనే అమ్మాయి తపాలా శాఖలో అద్భుతాలు చేస్తోంది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడంతో ఆమె చేస్తున్న క`షి అభినందనీయం" అని చెప్పుకొచ్చారు.