Skip to main content

Most Expensive Indian City: దేశంలోనే అత్యంత ఖరీదైన నగరం ఇదే.. ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువే..!

ప్రముఖ హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్‌–‘2024 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది.
Mumbai is the Most Expensive Indian City For expats Mercer 2024 Cost of Living Survey

దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో జీవించే ప్రవాసుల జీవన వ్యయం గణనీయంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. 

ప్రపంచ వ్యాప్తంగా 11 స్థానాలు ఎగబాకి 136వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189వ స్థానానికి, అలాగే బెంగళూరు ఆరు స్థానాలు క్షీణించి 195వ స్థానానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌ 202వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది.

ఉపాధి, ఉద్యో­గ అవకాశాల కోసం వేరొక నగరం, దేశానికి వలస వెళ్లి జీవించడంలో జీవన వ్యయం కీలక పాత్ర పోషిస్తోంది. స్థానిక ఆర్థిక పరిస్థితులు కొన్ని నగరాలను ప్రవాసులకు మరింత ఖరీదైనవిగా చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ వరుసలోనే పూణే ఎనిమిది స్థానాలు ఎగబాకి 205వ, కోల్‌కతా నాలుగు స్థానాలు ఎగబాకి 207వ స్థానానికి చేరుకున్నాయి.  

International Labour Organization Report: దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం ఏపీలోనే..

ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువ.. 
ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 21వ స్థానం, ఢిల్లీ 30వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది గృహాల అద్దెలు 12–15 శాతం పెరిగాయి. ముంబైలో 6–8 శాతం, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నైలలో 2–6 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక చెబుతున్నది. ఇక ముంబైలో రవాణా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. ఆ తర్వాత బెంగళూరు ఉంది.

పాల ఉత్పత్తులు, రొట్టెలు, పానీయాలు, నూనెలు, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ నిత్యావసరాల కోసం కోల్‌కతాలో పొదుపుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కేవలం ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు ఢిల్లీలో అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ఖర్చుల్లో మాత్రం ముంబై అందనంత ఎత్తులో ఉంది. దీని వెనుకే చెన్నై ఉంది. ఎనర్జీ, యుటిలిటీ ఖర్చుల్లో ముంబై, పూణేలు భయపెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. 
World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణం.. దీని పేరు ఏమంటే..
 

Published date : 20 Jun 2024 09:01AM

Photo Stories