Skip to main content

Archery Competitions: జిల్లా స్థాయిలో ఆర్చరీ పోటీలు..

ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి అర్చరీ పోటీల గురించి వివరించారు జిల్లా అర్చరీ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు. ఈ నేపథ్యంలో పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు నిర్వహించాల్సిన విధుల గురించి వివరించారు..
Archery Competitions at District Level at Government School

పిఠాపురం: ఈ నెల 7వ తేదీ శనివారం పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అర్చరీ శిక్షణ కేంద్రంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి అర్చరీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అర్చరీ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు జేఎన్‌ఎస్‌ గోపాలకృష్ణ, లక్ష్మణరావు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇండియన్‌ రౌండ్‌ బౌ విభాగంలో అన్ని వయసుల కేటగిరీల్లో జిల్లా స్థాయి ఆర్చరీ ఓపెన్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

CUET PG 2024 answer key Is Out: సీయూఈటీ-పీజీ 2024 ప్రాథమిక కీ విడుదల, ఇలా చెక్‌ చేసుకోండి

పురుషులు, మహిళలకు నిర్వహించనున్న ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, తీసుకురావాలని వారు తెలిపారు. ఇండియన్‌ రౌండ్‌, రీకర్వ్‌ కాంపౌండ్‌ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. వివరాలకు 99890 01162 నంబరును సంప్రదించాలని వారు సూచించారు.

SSC CPO Final Results: ఎస్సై తుది ఫలితాలు విడుదల, ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..

Published date : 06 Apr 2024 04:27PM

Photo Stories