Open School: పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ
పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023–24 విద్యా సంవత్సరానికి పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ గురువా రం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీఓపెన్‌స్కూల్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని దగ్గరలో గల ఓపెన్‌స్కూల్ సెంటర్ లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఫీజు చెల్లించి ప్రవేశాన్ని పొందవచ్చన్నారు. పదో తరగతి ప్రవేశం పొందే విద్యార్థులు ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు వయస్సు కలిగి ఉండాలన్నారు. అడ్మి షన్లకు రికార్డు సీటు లేదా టీసీతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, తల్లిదండ్రు ల ఆధార్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగ విద్యార్థులు వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు. ఇంటర్మీడియట్ ప్రవేశం పొందాల్సిన విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
చదవండి: School Students: విద్యార్థుల కోసమే ఓపెన్‌హౌస్
రీ–కౌంటింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురంటౌన్: డిప్లొ మా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ) రెండో ఏడాది పరీక్ష ఫలితా ల రీకౌంటింగ్‌కు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టులో నిర్వహించిన డిప్లొమా రెండో ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 1808 మంది అభ్యర్థులు హాజరుకాగా, 1259 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. మార్కుల డమ్మీ మె మోరాండం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హెచ్‌ఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చలానాను ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌కు చెల్లించాలని, సొంత చిరు నామా రాసిన ఎన్వలప్ కవర్, డమ్మీ మార్కుల మెమో నఖలు దరఖాస్తుకు జత చేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని ఆ ప్రకటనలో సూచించారు.
నేడు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
కొత్తవలస: వచ్చేనెల నవంబర్ 9,10 తేదీల్లో సీతారామ రాజు జిల్లా అరకులో జరగనున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అండర్–14 విభాగంలో బాలబాలికల జట్లను ఎంపిక చేసేందుకు శుక్రవారం పోటీలు నిర్వహించనున్నట్టు పీడీ కృష్ణంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఎంపిక పోటీలు సాగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని 11 నియోజకవర్గాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇందులోప్రతిభ చూపినవారిని బాలుర జట్టుకు 12 మంది, బాలికల జట్టుకు 12 మందిని ఎంపిక చేస్తామన్నారు.