Andhra University: డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్, ఫిల్మ్ ఎడిటింగ్, డబ్బింగ్, వోకల్, ఇనుస్ట్రుమెంటల్ మ్యూజిక్ తదితర పీజీ డిప్లొమా, డిప్లొ మా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డి.ఎ.నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఏయూలో సెయింట్ లూక్స్ ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ సంస్థలో సంయుక్తంగా సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఈ కోర్సులను నిర్వహించడం జరుగుతోందన్నారు. పదో తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ కోర్సుల్లో చేరవచ్చన్నారు.
చదవండి: Open 10th Class & Inter Admissions: సచివాలయాల్లో ‘ఓపెన్’ రిజిస్ట్రేషన్లు
కోర్సుల వివరాలు
ఆడియో ఇంజినీరింగ్–మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్సులో సర్టిఫికెట్ కోర్సుకు రూ.30 వేలు, డిప్లొమాకు రూ.50 వేలు, పీజీ డిప్లొమాకు రూ.1.5 లక్షలు ఫీజుగా ఉంటుందన్నారు. ఫిల్మ్ ఎడిటింగ్–డబ్బింగ్‌లో సర్టిఫికెట్ కోర్సుకు రూ.30 వేలు, వోకల్ ఇనుస్ట్రుమెంటల్ మ్యూజిక్‌లో సర్టిఫికెట్ కోర్సుకు రూ.20 వేలు, డిప్లొమాకు రూ.35 వేలు, పీజీ డిప్లొమాకు రూ.70 వేలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఉంటాయన్నారు. ఆడియో ఇంజినీరింగ్‌లో 50 మందికి, ఫిల్మ్ ఎడిటింగ్‌లో 25 మందికి, ఇనుస్ట్రుమెంటల్ మ్యూజిక్‌లో 50 మందికి ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులను ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సెప్టెంబర్ 11వ తేదీలోగా అందించాలని, 14న ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.audoa.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.