VC Acharya K.Padmaraju: అధ్యాపకులూ.. నిత్య విద్యార్థులే..
Sakshi Education
రాజానగరం: సాంకేతిక విజ్ఞానానికి అవసరమైన వివిధ అంశాలపై అవగాహన కల్పించడం కోసం యూనివర్సిటీలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు.
మూడ్ల్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ టీచర్స్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ గ్లోబల్ రికగ్నేషన్‌పై మార్చి 27వ తేదీ ఫ్యాకల్టీ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అధ్యాపకులు కూడా ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో నిత్య విద్యార్థులేనన్నారు. రీసోర్స్‌పర్సన్, జేఎన్‌టీయూకే మ్యాథమెటిక్స్ హెచ్‌ఓడీ వి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ మూడ్ల్స్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్ టీచింగ్ పద్ధతులను మెరుగుపర్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
B.Ed Admissions: ఏప్రిల్ 1వ తేదీ బీఈడీ స్పాట్ అడ్మిషన్లు
Published date : 28 Mar 2024 01:13PM