Chess Tournament: చెస్ టోర్నమెంట్‌లో గ్రామీణ క్రీడాకారుల ఘనత
కశింకోట: జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఎస్. రాయవరానికి చెందిన బి.శ్రావ్యశ్రీ విజేతగా నిలిచి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. మండలంలోని కన్నూరుపాలెంలో తులసీ కల్యాణ మండపంలో దువ్వూరు బాలకృష్ణమూర్తి జ్ఞాపకార్థం ప్రగతి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ చెస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆదివారం టోర్నమెంట్ నిర్వహించారు. తాళ్లపాలెంకు చెందిన బి.సాకేత్ ద్వితీయ స్థానం, అనకాపల్లికి చెందిన ఎం. గోపాలకృష్ణ తృతీయ స్థానంలో నిలిచారు.
TS TET 2024: టెట్ ఫీజుపై టెన్షన్.. ఈ కారణంగా పెంచాల్సి వచ్చిందంటున్న విద్యాశాఖ
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.1600, రూ.1400, రూ.1200 నగదు, జ్ఞాపికలను ప్రగతి చెస్ అకాడమీ అధ్యక్షురాలు డి.ఎస్. గాయత్రీదేవి అందజేశారు. మరో పది మందికి ప్రోత్సాహక నగదు బహుమతులు, పతకాలు అందజేశారు. జిల్లాలోని సుమారు 80 మంది క్రీడాకారులు టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రిటైర్డ్ పీహెచ్‌ఎన్ శోభాదేవి, సీనియర్ చెస్ క్రీడాకారులు శ్రీనివాస్, నరసింగబిల్లి రమణ, అయ్యలనాయుడు, చీఫ్ ఆర్బిటర్ డి.వి. సుధీర్‌కుమార్, పీడియోఆర్బిటర్లు వి.శ్రీకాంత్, బి.మల్లికార్జునరావు, జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags
- Chess Tournament
- open chess
- district level competitions
- kannurupalem
- students talent
- chess players
- district chess association
- Education News
- Sakshi Education News
- anakapalle news
- KashinkotaChess
- Tournament
- RuralPlayers
- PragathiChessAcademy
- BalakrishnamurthyMemorial
- TulsiKalyanaMandapam
- kannurupalem
- PresidentAward
- ChessPrizes
- TalentRecognition
- student competitions
- sakshieducation latest news
- Sports