Education Schemes: పథాకాల వల్లే మా బిడ్డ చదువు సాగుతుంది
అనకాపల్లి: నా పేరు బోడి మాధవి. బుచ్చెయ్యపేట మండలం నేతవానిపాలెం మాది. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. మా ఇంటాయన అప్పారావు. మాకు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు ఆడపిల్లలు. మాకున్న 40 సెంట్ల పొలంలో వ్యవసాయం చేస్కుంటూ, మేకల్ని మేపుతూ బతుకుతున్నం. వర్షాలు కురిస్తేనే పంట పండుతాది. తిండిగింజలకే సానా ఇబ్బందులు పడేటోళ్లిమి. పెద్ద కూతురు తేజశ్రీ పుట్టడమే అదేదో జబ్బు (తలసేమియా)తో పుట్టినాది. బడ్లో ఏయకూడదనుకున్నం. అమ్మఒడి పథకంలో డబ్బులు, బట్టలు, పుస్తకాలు ఇస్తున్నారని బడ్లో ఏశాం.
Students Re Union: అప్పటి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. వారి పాఠశాలకు..!
ఏటా రూ.15 వేలు ఇస్తన్నరు. బడ్లేకే పంపం అనుకున్న నా కూతురు ఇపుడు మూడో క్లాసులోకి వచ్చింది. అచ్చరాలు కూడా చదువుతంది. వైఎస్సార్ బిడ్డ జగనన్న సీఎం అయ్యాక మా ఇబ్బందులు చాలా వరకు తీరాయి. పాపకి నెలకి రూ.10 వేలు పింఛన్ కూడా వత్తంది. మా కుటుంబానికి జగనన్న అండగా నిలిచారు. ఈ పెబుత్వం లేకపోతే మా బతుకులు ఏటైపోయేవో తల్చుకుంటేనే బయమేత్తంది. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, పింఛన్, ఆసరా పథకాల డబ్బులు మా బేంకు ఎకౌంట్లో పడ్డాయి. ఐదేళ్లలో ఈ పెబుత్వం వల్ల రూ.9.16 లచ్చలు మేలు కలిగింది. మాలాంటోళ్ల బతుకులు బాగుండాలంటే కలకాలం జగనన్నే సీఎంగా ఉండాల.
Tags
- AP government
- education of students
- Schemes
- jaganna schemes
- poor family
- Education Schemes
- Education News
- Sakshi Education News
- anakapalle news
- Children education
- Rural life challenges
- Government support
- Educational Opportunity
- Farming community
- School enrollment
- Rural Development
- Poverty alleviation
- sakshieducation latest news