Students Re Union: అప్పటి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. వారి పాఠశాలకు..!
బుచ్చెయ్యపేట: వారంతా 65 ఏళ్ల కిందట చదువుకుని పదో తరగతి పరీక్షలు తరవాత విడిపోయిన విద్యార్థులు. పలువురు ఉద్యోగాలు పొంది పదవీ విరమణ చేయగా, మరికొంత మంది రాజకీయంగా, పలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న వారంతా ఆదివారం తాము చదువుకున్న వడ్డాది కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హైస్కూల్లో కలుసుకున్నారు. నూనుగు మీసాల కుర్ర వయస్సులో విడిపోయిన వారంతా ఇపుడు తలలు నెరిసిన దశలో కలుసుకుని చిన్న పిల్లల్లా సందడి చేశారు.
Campus Drive: సెంట్రల్ యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్
ఎస్‌ఐలుగా, తహసీల్దార్‌లుగా, టీచర్లుగా పలు ఉద్యోగాలు, రాజకీయాలు, వ్యాపారాలు చేసిన వారంతా తమ వయస్సును, స్థాయిని పక్కన పెట్టి, నాటి స్కూలు పిల్లల్లా కలిసిపోయి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆరోజు నీవు అలా ఉండేవాడివి, ఇపుడేంటిరా ఇలా అయిపోయావు? అంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కుటుంబ వ్యవహారాలు తెలుసుకుంటూ ఉదయం నుండి రాత్రి వరకు సంతోషంగా గడిపారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కమిటీ వేసి గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మెరిట్ సాధించిన విద్యార్థులు వై.గగన్‌తేజకు రూ. 10 వేలు, సందీప్‌కు రూ, 8 వేలు, ఎం.అభిషేక్‌కు రూ. 5 వేలు నగదు అందించి వారి తల్లిదండ్రులను సత్కరించారు.
AP Inter Exam Evaluation: ప్రారంభమై ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులతో పాటు పాఠశాల అభివృద్ధి కోసం కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా కోవెల జనార్ధనరావు, అధ్యక్షునిగా సయ్యపురెడ్డి వెంకటరమణ, జనరల్ సెక్రటరీగా కోవెల రవి, ఉపాధ్యక్షులుగా సయ్యపురెడ్డి వరహాలబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.ధర్మజ్యోతి, జాయింట్ సెక్రటరీగా శ్రీనాఽఽథ్, రమేష్, కోశాధికారిగా సయ్యపురెడ్డి భాస్కరరావు మెంబర్లుగా బంగారి త్రిమూర్తులు, గరికిపాటి మేఘారావు, సయ్యపురెడ్డి సత్యనారాయణ, గుద్దేటి పోతురాజు, పినపాత్రుని సాంబశివరావులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.