SSLC Exam: ఎస్‌ఎస్‌ఎల్‌సీ వార్షిక పరీక్షలు ప్రారంభం..
శివాజీనగర: ఎస్‌ఎస్‌ఎల్‌సీ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ జారీ చేశారు. 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్, ఇంటర్‌నెట్ కేంద్రాలు మూసివేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Tenth Exams: సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు
స్టాటిస్టిక్స్ విషయంలో మాత్రం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ వినియోగించేందుకు అనుమతి ఇస్తారు. గుర్తింపు కార్డు, హాల్ టికెట్ తప్పనిసరి. పరీక్ష రాసే విద్యార్థులు ప్రవేశ పత్రం చూపించి కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. మొబైల్ ఫోన్లను కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షా సమయానికి ముందుగానే బయటికి వెళ్లే విద్యార్థులకు ప్రశ్న పత్రం ఇవ్వరు. పరీక్షా గది, ఆవరణంలో తప్పకుండా సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
Training and Employment: టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణతో ఉపాధి అవకాశం..