Tenth Exams: సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు
రాయచూరు రూరల్: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలని దేవదుర్గ తాలూకా విద్యాశాఖాధికారి సుఖదేవ్ పిలుపునిచ్చారు. శనివారం ఖేణద మురిగప్ప జూనియర్ కళాశాలలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో 15 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Training and Employment: టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణతో ఉపాధి అవకాశం..
300 మంది సిబ్బందిని నియమించామన్నారు. 2120 మంది బాలురు, 2318 మంది బాలికలు ఈసారి పరీక్షలు రాస్తున్నారన్నారు. విద్యార్థులు చదువు, ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలన్నారు. తాలూకాలో 2023–24వ సంవత్సరపు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచిమార్కుల సాధనకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. సమావేశంలో గ్రేడ్–2 తహసీల్దార్ వెంకటేష్, టీపీ ఈఓ బాబు రాథోడ్‌లున్నారు.
Students Attendance for Exams: జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలకు హాజరు, గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య..!