Academy for Competitive Exams : పోటీ పరీక్షల్లో కల్పవృక్షంగా కౌండిన్య ఐఏఎస్ అకాడమీ.. విద్యార్థులకు వరంగా..!
పెదకాకాని: అతి తక్కువ ఫీజులతో భోజన వసతి కల్పిస్తూ పోటీ పరీక్షల్లో అత్యున్నత శిక్షణ అందిస్తున్న కౌండిన్య ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు కల్పవృక్షంగా మారిందని శాసనమండలి సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల కౌండిన్య ఐఏఎస్ అకాడమీ బ్యాంకింగ్ పరీక్ష కోసం నిర్వహించిన శిక్షణలో మొదటి బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు సభకు శనివారం ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. అకాడమీ వ్యవస్థాపకులు, విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ ఈవీ నారాయణ అధ్యక్షత వహించారు.
AP PHC Doctors : ప్రభుత్వానికి వైద్య సంఘం లేఖ.. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్..!
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఎల్‌ఐసీ, బ్యాంకింగ్ రంగాలలో ఉద్యోగాలకు ఉత్తమ శిక్షణ ఇవ్వడంలో కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఆదర్శనీయంగా ఉందన్నారు. విద్యార్థులు నిరంతరం పట్టుదలతో ఇష్టపడి చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించాలన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
అకాడమీ అందిస్తున్న కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ ఈవీ నారాయణ 20 సంవత్సరాల క్రితమే కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారన్నారు. రూ.2.25 కోట్ల మూలధనాన్ని సమకూర్చి ఇప్పటి వరకు ప్రతిభ గల పేద విద్యార్థులకు రూ.రెండు కోట్ల మేరకు ఉపకార వేతనాలు అందించడం అభినందనీయం అన్నారు.
Private Schools Association : నేడు ప్రైవేట్ పాఠశాలల సంఘం సభ్యసమావేశం..
విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడం కోసం రూ.7 కోట్ల విరాళాలు సేకరించి కౌండిన్య ఐఏఎస్ అకాడమీని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. విద్యార్థులు అకుంఠిత దీక్షతో అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
☛☛ Follow our Instagram Page (Click Here)
కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవీ నారాయణ ప్రసంగిస్తూ.. ప్రతిభ గల పేద విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రూ.50 లక్షలతో డాక్టర్ ఈవీ నారాయణ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా పేద విద్యార్థులకు నైపుణ్యాలను అందించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
☛ Join our Telegram Channel (Click Here)
ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు రచించిన ‘సివిల్ సర్వీసెస్ ప్రాథమిక అంశాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతులను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు వాకా రామ్‌గోపాల్ గౌడ్, చిలక చంద్రమౌళి, బెల్లంకొండ సదాశివ గౌడ్, పామర్తి సాంబశివ రావు, వీరంగి రంగారావు, వేముల శేషాచలం, డాక్టర్ కృష్ణ, డాక్టర్ తాతా సాంబశివ రావు, వడ్డెంగుంట సుబ్బారావు, బొబ్బిళ్ళ వెంకటేశ్వర రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.