Science Exhibition : జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్.. 33 గురుకులాలు 88 వర్కింగ్ నమూనాల ప్రదర్శన!
మధురవాడ (విశాఖ జిల్లా): ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను విద్యార్థులు చక్కటి పరిష్కారాన్ని చూపించే వర్కింగ్ నమూనాలు తయారు చేశారు. ఇవి సందర్శకులతో పాటు కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను సైతం ఔరా అనిపించాయి. అద్భుతమైన నమూనాలకు మధురవాడ సమీపంలోని కొమ్మాది రిక్షా కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వేదిక అయింది.
Internet Day: అక్టోబర్ 29వ తేదీ అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ‘ఫ్యూచర్ ఆన్’ పేరుతో జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర పరిధిలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పరిధిలో లెక్కలు, సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యుమానిటీస్‌తో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో సీనియర్, జూనియర్ విభాగాల్లో 33 గురుకులాలు నుంచి వచ్చిన 150 మంది విద్యార్థులు 88 వర్కింగ్ నమూనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రారంభించారు. నమూనాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, అంతర్గత శక్తులను వెలికి తియ్యడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగప డతాయన్నారు. విద్యార్థులకు ప్రశ్నించే స్వేచ్ఛను ఉపాధ్యాయులు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ ఉపాధికి ఉపయోగపడే విద్య అవసరమన్నారు. విశాఖ జిల్లా గురుకుల డీసీవో రూపావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాంతికుమారి, డీసీవోలు పాల్గొన్నారు.
Japan Elections: జపాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో.. మెజారిటీ కోల్పోయిన అధికార కూటమి
Tags
- Science Exhibition
- Gurukul students
- sample presentations
- Future On
- AP Gurukul School
- zonal level science exhibition
- Working models
- students talent
- Maths and science
- Information Technology
- science sample presentations
- gurukul school students
- 33 gurukuls
- 88 working samples
- Education News
- Sakshi Education News