Skip to main content

UGC: ఉన్నత విద్యలో ‘షేరింగ్‌’

అనంతపురం: అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన, ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే (షేరింగ్‌) ధోరణికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) శ్రీకారం చుట్టింది.
నాలెడ్జ్‌ షేరింగ్‌ – నాలెడ్జ్‌ ట్రాన్స్‌ఫర్‌,UGC Knowledge Sharing ,Educational resources sharing
‘నాలెడ్జ్‌ షేరింగ్‌ – నాలెడ్జ్‌ ట్రాన్స్‌ఫర్‌’

‘నాలెడ్జ్‌ షేరింగ్‌ – నాలెడ్జ్‌ ట్రాన్స్‌ఫర్‌’ నినాదంతో ఓ విద్యాసంస్థలోని టెక్నాలజీని, ఇతర వనరులను మిగిలిన సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే సెంట్రల్‌ వర్సిటీలు సహా దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను సమీపంలోని వనరులు లేని ఇతర ఉన్నత విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ తమ విద్యార్థుల్లో నైపుణ్యాలు తీర్చిదిద్దేందుకు ఈ విధానం దోహదపడనుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులతో పాటు పరిశోధన కోర్సుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

Current Affairs: G20 Summit 2023 - భారత మండపం విశేషాలు | నటరాజ విగ్రహ విశేషాలు #sakshieducation

రెట్టింపు ఫలితాలు

యూజీసీ తీసుకున్న ‘నాలెడ్జ్‌ షేరింగ్‌ – నాలెడ్జ్‌ ట్రాన్స్‌ఫర్‌’ విధానం ద్వారా రెట్టింపు ఫలితాలు ఉంటాయని విద్యావేత్తలు అంటున్నారు. అకడమిక్‌ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమలు చేయాలంటే అదనపు సదుపాయాలు అవసరమవుతాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఉన్నత విద్యా సంస్థలు పరస్పర సహకారంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి.

TS TET 2023 Paper-2 Question Paper #sakshieducation

సమానమైన విద్యను ఆర్జించేలా

విద్యా పరమైన మౌలిక వనరులు పలు కళాశాలల్లో లేకపోవడంతో ఉన్న వనరులతోనే ఆయా కళాశాలలు నెట్టుకొస్తున్నాయి. దీంతో విద్యార్థులకు సమానమైన విద్య అందక నైపుణ్యాలు కొరవడి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థల్లో చదివే విద్యార్థులతో సమాన విద్యావకాశాలను అందిపుచ్చుకునేలా యూజీసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉన్న వనరులను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగే ఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరనుంది. అండర్‌గ్రాడ్యుయేట్‌, పోసు్ట్రగాడ్యుయేట్‌, పీహెచ్‌డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలు చేయాలని యూజీసీ సూచించింది. ఆయా విద్యాసంస్థల్లో ఉన్న తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఉన్నత విద్యాసంస్థలకు తెలిసేలా వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్ధిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలు చేయవచ్చునని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

 

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న "మహిళా రిజర్వేషన్ బిల్లు" #sakshieducation

అవగాహన ఒప్పందాలతో ముందడుగు

ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు తొలుత అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని యూజీసీ సూచించింది. ఏ సమయంలో ఏ సంస్థ విద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర ప్రణాళికను రూపొందించి ఆ ప్రకారం కార్యచరణ అమలుకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వనరులు పూర్తి స్థాయిలో వినియోగంచుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉంచకుండా చూసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. అకడమిక్‌ అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ బోధనలు, వీడియోలు, లెర్నింగ్‌ మెటీరియల్‌, లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లను ఇచ్చిపుచ్చుకోవచ్చునని పేర్కొంది. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారమ్‌ ద్వారా పూర్తి చేయాలని, శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చునని సూచించింది. పరిశోధన స్థాయిలో వనరుల భాగస్వామ్యం అనేది ఆయా పరిశోధకుల స్థాయిలో ఉండాలని, పీజీ స్థాయిలో వనరుల షేరింగ్‌ విభాగాల వారీగా లేదా సంస్థాగత స్థాయిలో ఉండొచ్చునని స్పష్టం చేసింది.

G20 Summit 2023-Biofuel Alliance: అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి..ప్రపంచ లీడర్ గా భారత్ #sakshieducation

 

Published date : 22 Sep 2023 11:35AM

Photo Stories