UPSC Examinations 2023: యూపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి ఎడ్యుకేషన్: ఈనెల 15వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంపత్‌కుమార్ తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు చేపట్టిన ఏర్పాట్లపై గురువారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్‌వైజర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఈనెల 15, 16, 17, 23, 24 తేదీల్లో ఐదు రోజుల పాటు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 171 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు.
Lecturer posts: లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు
పటిష్ట బందోబస్తు
పరీక్షల నిర్వహణకు 26 మంది ఇన్విజిలేటర్‌లను నియమించామని జేసీ చెప్పారు. ముగ్గురు విభిన్న ప్రతిభావంతులు పరీక్షలకు హాజరుకానున్న క్రమంలో పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు ఇద్దరు వెన్యూ సూపర్ వైజర్లు, ఐదుగురు అసిస్టెంట్ సూపర్‌వైజర్లను నియమించామని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా తాగునీరు, అవసరమైన మందులతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు.
అభ్యర్థుల హాల్ టికెట్లలో నమోదు చేసిన పరీక్ష కేంద్రం పేరు, అభ్యర్థి రాసే పరీక్ష కేంద్రం ఒకే విధంగా ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. పరీక్ష కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ ఆయా రూట్లలో బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Civils Ranker: సొంత ట్రైనింతో సివిల్స్‌లో విజయం
పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి, పరీక్షల కస్టోడియన్ అధికారి జి.వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. సమావేశంలో యూపీఎస్సీ ప్రిన్సిపాల్ ప్రైవేట్ సెక్రటరీ రేష్ దీపక్ శర్మ, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, లెక్చరర్ డాక్టర్ డీఎస్‌వీఎస్ బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ వెన్నెల శ్రీను, ఎం.వెంకటరామయ్య ఉన్నారు.