Skip to main content

Lecturer posts: లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు

Lecturer posts,Government Degree College ,Guest Lecturer
Lecturer posts

నర్సీపట్నం: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కామర్స్‌, ఎకనామిక్స్‌, లైబ్రేరియన్‌ సబ్జెక్టులు బోధించే గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎస్‌.రాజు తెలిపారు. ఎకనామిక్స్‌–1, లైబ్రేరియన్‌–1, కామర్స్‌–3 పోస్టులు ఉన్నాయన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని, ఎన్‌ఈటీ, ఎస్‌ఎల్‌ఈటీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తులు అందించాలన్నారు. ఇంటర్వ్యూలు 20వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామన్నారు.

పీజీలో ప్రవేశాలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులలో మిగిలి ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఎంకామ్‌లో 40, ఎమ్మెస్సీలో 20 సీట్లు ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా 20వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌, 22 లోగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ చేసుకోవాలన్నారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీలోగా వెబ్‌ ఆప్షన్స్‌ పెట్టుకోవాలన్నారు.

Published date : 15 Sep 2023 07:53AM

Photo Stories