Skip to main content

Civils Ranker: సొంత ట్రైనింతో సివిల్స్‌లో విజ‌యం

ఎంతోమంది సివిల్స్ కోసం ఎన్నో కోచింగ్ సెంట‌ర్ల‌ను సంద‌ర్శిస్తారు. కొంద‌రికి వెంట‌నే ల‌భిస్తుంది మ‌రికొంద‌రికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఎక్కువ శాతం విద్యార్థులు సివిల్స్ కోసం కోచింగ్ సెట‌ర్లనే వినియోగిస్తారు. కానీ, ఈ యువ‌కుడు మాత్రం త‌న‌కు తానుగానే కోచింగ్ తీసుకున్నాడు. త‌మ తెలివితో, త‌మ త‌ల్లిదండ్రుల స‌ల‌హాల‌తో, త‌న కృషితో విజ‌యం సాధించాడు. ఈ యువ‌కుడి విజ‌యం గురించి అత‌ని మాటల్లోనే తెలుసుకుందాం....
Civils ranker Ajmeer Sanketh Kumar, Parental support and guidance
Civils ranker Ajmeer Sanketh Kumar

సాక్షి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా బతుకున్నాయని సివిల్స్‌-2022లో ఆలిండియా 35వ ర్యాంకు సాధించిన అజ్మీరా సంకేత్‌కుమార్ తెలిపారు. అందుకే గిరిజన తండాల్లో చైతన్యం నింపేందుకు కృషి చేస్తానని ఇంట‌ర్య్వూలో తెలిపారు.

Women's Success Story: ఐఆర్ఎస్ అధికారిణి.... ఎంతోమందికి స్పూర్తిగా ఈ మ‌హిళ‌

త‌మ తల్లిదండ్రులే త‌నకు స్పూర్తి...

మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి. అమ్మ సవిత ఇస్రోలో ఉద్యోగం చేస్తారు. నాన్న ప్రేమ్‌సింగ్‌ హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌. నాకు మా అమ్మనాన్నలే రోల్‌మాడల్‌. వాళ్లలానే ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రతిక్షణం పరితపించాను. చివరికి సివిల్స్‌కు ఎంపికయ్యాను. ఈ క్షణం మా అమ్మానాన్నల కళ్లలో చూసిన ఆనందమే నా విజయానికి ప్రతీక.

విజ‌యం కోసం కృషి

సివిల్స్‌లో ర్యాంకు సాధిస్తాననే నమ్మకం నాకు మొదటి నుంచే ఉంది. కోచింగ్‌ తీసుకోకుండానే సివిల్స్‌కు సొంతగా ప్రిపేర్‌ అయ్యా. మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుదిరిగినా.. అయినా వెనుకడుగు వేయకుండా మొదటిసారి ఎక్కడ పొరపాటు జరిగిందో ఒకటికి పదిసార్లు ఆలోచించా. రెండోసారి ఎలాగైనా సక్సెస్‌ సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రిపేర్‌ అయ్యా. 35వ ర్యాంకు సాధించా.

Lieutenant Karnal Abhishek Reddy : లెఫ్టినెంట్ కల్నల్ అభిషేక్ రెడ్డిని ఘ‌నంగా సన్మానించిన గ్రామ‌పెద్ద‌లు..

రిసెర్చ్‌ అంటే ఇష్టం.. కానీ

అమ్మానాన్నల ఉద్యోగరీత్యా మేం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. హైదరాబాద్‌లోని భాష్యం పబ్లిక్‌ స్కూల్‌లో 2011లో పదో తరగతి పూర్తయ్యింది. ఫిట్‌(ఎఫ్‌ఐఐటీ) జేఈఈ సైఫాబాద్‌ బ్రాంచ్‌లో 2013లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశా. దిల్లీ ఐఐటీలో 2017లో బీటెక్‌ పట్టా తీసుకున్నా. నాకు మొదటి నుంచి రిసెర్చ్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే.. ఆ తర్వాత జపాన్‌లో రిసెర్చింగ్‌లో ఉద్యోగం చేశా. కానీ సంతృప్తి కలుగలేదు. అందుకే.. సివిల్స్‌ సాధించాలని నిర్ణయించుకున్నాను. అమ్మానాన్న కూడా ఒప్పుకున్నారు.

త‌యారీ తీరు

‘చాలా మంది ప్రతిభావంతులు పోటీ పడే పరీక్ష ఇది. అందుకే.. ప్రతిక్షణం ఎంతో ముఖ్యం. అలాగని గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పనిలేదు. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు.. ఏం చదువుతున్నాం, ఎలా చదువుతున్నామన్నదే ముఖ్యం. చదువుతున్నంత సేపు శ్రద్ధపెడితే విజయం మీ సొంతం అవుతుంది.’ మానసిక ప్రశాంతత కోసం హాకీ, బ్యాడ్మింటన్‌ ఆడేవాడిని.

AP SI of Police Final Exam 2023: ఎగ్జామ్ ప్యాటర్న్,సిలబస్ ఇదే... బిట్ బ్యాంక్ కోసం ఇక్కడ చూడండి!

పుస్త‌కాల‌తో పాటు....

సివిల్స్‌ అనగానే ఎక్కువ మంది రోజుకు 12 నుంచి 16 గంటలు చదవాలని భ్రమపడుతూ ఉంటారు. ఎక్కువ పుస్తకాలు చదివెయ్యాలని తాపత్రయ పడుతూ ఉంటారు. కానీ.. సివిల్స్‌ సాధించాలంటే ముందు చదవాల్సింది సమాజాన్ని. నేను అందులో సక్సెస్‌ అయ్యాను. పుస్తకాలతోపాటు సమాజంపై ఎక్కువ అధ్యయనం చేశాను. ప్రతి అంశాన్ని ప్రస్తుతంతో ముడిపెడుతూ అర్థం చేసుకుంటూ, అవకాశం దొరికితే స్నేహితులతో చర్చించేవాడిని. దీనివల్ల.. చదివినది తొందరగా వంట పట్టింది.

Published date : 15 Sep 2023 12:08PM

Photo Stories