UPSC Prelims Questions: ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా... సివిల్స్‌లో ఇంత కఠినమైన ప్రశ్నలుంటాయా...?
తాజాగా మే 28వ తేదీ నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష అత్యంత కఠినంగా వచ్చింది. ఈ పరీక్షలో ఒక ప్రశ్నను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వణ్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసేమో ప్రయత్నించండి.
చదవండి: సివిల్స్-2023 ప్రిలిమ్స్ కొశ్చన్ పేపర్ & కీ సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ ఏడాది మే 28న సివిల్ సర్వీసెస్ 2023 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి పరీక్షలో అడిగిన పలు ప్రశ్నలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో 87వ ప్రశ్న ఉడుతలకు సంబంధించింది. ఇది అభ్యర్థులను తికమకపెడుతోంది. చూడడానికి సరళంగా ఉన్నా ఈ ప్రశ్నకు జవాబు మాత్రం ఒక్కోక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారు.
చదవండి: అదరగొట్టిన యూపీఎస్సీ టాపర్ ఇషితా కిషోర్... ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నంటే...
ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. గతంలో ఉడుతల గురించి షేర్ చేసిన సమాచారాన్ని జోడించి... ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆయన వివరించారు. ఇంతకూ ఆ ప్రశ్న ఏంటంటే...
87. భారతీయ ఉడుతలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణనలోకి తీసుకొని ఏది నిజమో తెలియజేయండి?
ఎ. ఇవి భూమిలో బొరియలు తయారు చేయడం ద్వారా గూళ్లు నిర్మించుకుంటాయి.
బి. ఇవి కాయలు, విత్తనాలు వంటి ఆహార పదార్థాలను భూమిలో నిల్వ చేస్తాయి.
సి. ఇవి సర్వభక్షకాలు
ఇందులో ఆన్సర్ ఏంటో మీకు తెలుసా..?
ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ చెప్పిన సమాధానం : ఆప్షన్ బి