Civil Services Main 2023: సివిల్స్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల... సెప్టెంబర్ 15 నుంచి ఎప్పటివరకంటే...
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. పరీక్ష షెడ్యూల్ వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది.
షెడ్యూల్‌లో వెల్లడించిన వివరాల మేరకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 24 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
ఇవీ చదవండి: బిగ్ బ్రేకింగ్... తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల... డీఎస్సీపై క్లారిటీ..!
మెయిన్స్ పరీక్ష రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. ఫస్ట్ సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలు మే 28వ తేదీ నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 12న వెలువడ్డాయి.
UPSC సివిల్స్ సర్వీస్ ఎగ్జామ్ మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రాథమికస్థాయిలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చినవారికి తుదిలో పర్సనల్ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్స్ రిజల్ట్స్ అనంతరం ఇంటర్వ్యూ తేదీలు ప్రకటిస్తారు.
ఇవీ చదవండి: పదో తరగతి అర్హతతో ఎయిర్‌పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు... పరీక్ష లేకుండానే నియామకం.. ఇలా అప్లై చేసుకోండి
Published date : 01 Aug 2023 06:18PM
PDF