సాక్షి, ఎడ్యుకేషన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ 2022 కోసం ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. సివిల్ సర్వీసెస్ ప్రీ అండ్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in & https://www.upsconline.in. ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను చెక్ చేసుకోవచ్చు.
UPSC Civil Services 2022 Interview schedule
రెండు సెషన్లలో ఇంటర్వ్యూలు...
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో 582 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు అర్హత సాధించారు. వీరికి ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటలకు.. రెండవ సెషన్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఏ సమయంలో హాజరు కావాలో పర్సనాలిటీ టెస్ట్ లెటర్‌లో మెన్షన్ చేసి ఉంటుంది.