Skip to main content

Civils Prelims 2023: ప్ర‌శాంత‌త‌తో ముందుకు వెళ్లండి... ఈ చిట్కాలు పాటించి సివిల్స్ లో గెల‌వండి

ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో అత్యున్న‌త ఉద్యోగం మాత్రం ఐఏఎస్‌. కొన్ని ల‌క్ష‌ల‌ మంది విద్యార్థులు తాము ఐఏఎస్ కావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటారు. అందులో చాలా కొద్ది మంది మాత్ర‌మే త‌మ ల‌క్ష్యాన్ని చేరుకుని, ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలుస్తుంటారు. అయితే ప్ర‌తీ ఏడాది యూపీఎస్సీ సివిల్స్ నిర్వ‌హిస్తుంటుంది. ఈ ప‌రీక్ష‌కు ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకుంటుంటారు. దేశ వ్యాప్తంగా పోటీ ఉండ‌డంతో ప్ర‌తీ మార్కు విలువైన‌దిగా భావించాలి.
UPSC Civils Prelims
UPSC Civils Prelims

ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా ఒక చాన్స్‌ను కోల్పోవాల్సిందే. ఈ నేప‌థ్యంలో సివిల్స్‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ఈ చిట్కాలు పాటిస్తే మంచి స్కోర్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అవేంటో చూద్దాం.

చ‌ద‌వండి: విద్యార్థుల‌కు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్‌... సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా మొత్తం 21 సర్వీసులకు అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేస్తుంది. మూడు దశల్లో జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో మొదటి దశ అయిన‌ ప్రిలిమ్స్ ను మే 28న నిర్వహించ‌నున్నారు.

upsc

ఫ్రెషర్స్ నుంచి రిపీటర్ల వరకు లక్షలాది మంది ఈ పరీక్ష కోసం పోటీపడతారు. దీని కోసం చాలా మంది ఏళ్ల తరబడి చదువుతూ ఉంటారు.

చ‌ద‌వండి: డాలర్‌ కోటకు బీటలు... మ‌రో 10 ఏళ్ల‌లో డాల‌ర్ క‌థ ముగియ‌బోతోందా...
1:12.5 నిష్పత్తిలో మెయిన్స్ కు...
సివిల్ సర్వీసెస్-2023 ద్వారా 21 సర్వీసుల్లో మొత్తం 1105 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయ‌నున్నారు. ప్రిలిమ్స్ మొదటి దశ కోసం దేశవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ లో రాణిస్తే తదుపరి దశ మెయిన్స్ కు అర్హత సాధిస్తారు. ఒక్కో పోస్టుకు 1:12.5 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. సివిల్స్ కు ఆరు లక్షల మంది హాజరైతే కేవలం 14 వేల మందిని మాత్రమే మెయిన్స్ కు సెల‌క్ట్ చేస్తారు. 

చ‌ద‌వండి: ఒక పోస్టుకు 174 మంది పోటీ... ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు భారీగా అభ్య‌ర్థులు
ఈ చిట్కాలు ప్ర‌య‌త్నించండి

  •  ప‌రీక్ష‌కు కేవ‌లం నెల రోజులు మాత్ర‌మే ఉన్న ఈ నేప‌థ్యంలో అస్స‌లు ఒత్తిడికి లోనుకాకుండా చదువు కొనసాగించాలి.
  •  సాధ్య‌మైనంత విశ్రాంతి తీసుకోవాలి. రోజువారీగా ప్రిపేర్ అయ్యే స‌మ‌యాన్ని పెంచుకుంటూ వెళ్లాలి.
  •  మాక్ టెస్ట్ ల‌లో మంచి స్కోర్ రాకపోతే కంగారు పడకండి. ప్రతి మాక్ టెస్ట్ లో ప్రశ్నలు మారుతూ ఉంటాయి. 
  • upsc

     

  •  ఏ స‌బ్జెక్టులో వీక్‌గా ఉన్నారో దానిపై ఎక్కువ ఫోక‌స్ పెట్టాలి. 
  •  ఏ ఒక్క మార్కును వ‌దులుకోకూడ‌దు. ఒక్క మార్కే జీవితాన్ని త‌ల‌కిందులు చేస్తుంది.
  •  మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంచుకోవాలి. చ‌దువుపైనే ఫోక‌స్ పెడితే భ‌యం పోతుంది.
  •  అతిగా ఆలోచించొద్దు. దీని వల్ల ఒత్తిడికి లోన‌య్యే ప్ర‌మాదం ఉంది. ఆశావ‌హ కోణంలో ఉండాలి. ఒక్క సెకను కూడా వృథా చేయకుండా ప్రశాంతమైన మనస్సుతో చదవండి. 
Published date : 24 Apr 2023 05:49PM

Photo Stories