Skip to main content

Excise Constable: ఒక పోస్టుకు 174 మంది పోటీ... ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు భారీగా అభ్య‌ర్థులు

ఖాకీ కొలువులకు యువతలో ఎంతో క్రేజ్‌ ఉంటుంది. అవకాశం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్‌ ఉద్యోగానికి పోటీ పడుతుంటారు. ఈసారి కూడా కానిస్టేబుల్‌ పోస్టులకు విపరీతమైన పోటీ ఉంది. ఈ నెల నిర్వహించనున్న కానిస్టేబుల్‌ పోస్టుల తుది రాత పరీక్షకు పార్ట్‌–2 దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే కానిస్టేబుల్‌ పోస్టులకు కాంపిటీషన్‌ ఫుల్‌ అన్న విషయం స్పష్టం అవుతోంది.
Excise Constable posts in Telangana
Excise Constable posts in Telangana

సివిల్‌ పోలీస్, టీఎస్‌ఎస్పీ, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్లశాఖ, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ శాఖల్లో కానిస్టేబుల్‌ పోస్టులకు ఈనెల తుది రాత పరీక్ష నిర్వహించబోతున్నారు. ఉమ్మడి పది జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పోలీస్‌ నియామక మండలి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు సమయం ఇచ్చింది. ప్రతి అభ్యర్థి  www.tslprb.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ లాగిన్‌ ఐడీ ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Exice

చ‌ద‌వండి: 677 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..​​​​​​​
ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌కు పోటీ తీవ్రం..  

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. మొత్తం 614 పోస్టులకుగాను 1,06,­272 మంది తుది రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్‌ కానిస్టేబుల్, ఇతర పోస్టులకు కలిపి మొత్తం 3,40,639 మంది తుది రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు.

Published date : 24 Apr 2023 02:18PM

Photo Stories