Skip to main content

National Eligibility Test: యూజీసీ నెట్‌లో అర్హత సాధించేందుకు ఎగ్జామ్‌ డే టిప్స్‌..

Last minute Preparation Tips and Tricks To Crack The Exam
Last minute Preparation Tips and Tricks To Crack The Exam

దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా చేరేందుకు.. అలాగే పరిశోధనలకు అవసరమైన ఫెలోషిప్‌లు పొందేందుకు మార్గం.. యూజీసీ–నెట్‌! ఈ పరీక్షను ఏటా రెండుసార్లు (డిసెంబర్‌/జూన్‌) నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన డిసెంబర్‌–2020 సెషన్, అలాగే జూన్‌–2021 పరీక్షలను ఈ నెల  (నవంబర్‌) 20వ తేదీ నుంచి వచ్చే నెల (డిసెంబర్‌) 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్‌లో అర్హత సాధించేందుకు ఎగ్జామ్‌ డే టిప్స్‌.. 

  • ఈనెల 20వ తేదీ నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు ప్రారంభం
  • 2020 డిసెంబర్, 2021 జూన్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్‌టీఏ 
  • యూజీసీ నెట్‌లో విజయంతో జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మార్గం

ఏదైనా సబ్జెక్టులో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. పీహెచ్‌డీలో చేరి పరిశోధనలు కొనసాగించేందుకు అవసరమైన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) లభిస్తుంది. అదేవిధంగా నెట్‌లో అర్హతతో యూనివర్సిటీలు/కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వాయిదాలు పడుతూ
కరోనా కారణంగా యూజీసీ నెట్‌ పరీక్ష ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. తాజాగా నెట్‌ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించిన వివరాల ప్రకారం–యూజీసీ–నెట్‌ డిసెంబర్‌ 2020 సెషన్‌కు సంబంధించిన పరీక్షలను ఈనెల అంటే నవంబర్‌ 20,21,22,23,24,25,26, 29,30 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే యూజీసీ–నెట్‌ జూన్‌–2021 సెషన్‌కు సంబంధించిన పరీక్షలను డిసెంబర్‌ 1, 3, 4, 5 తేదీల్లో జరపనున్నారు.

పరీక్ష ఇలా
యూజీసీ–నెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌(సీబీటీ–కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. పేపర్‌ 1.. 50 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. అలాగే పేపర్‌ 2.. 100 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం పరీక్ష సమయం మూడు గంటలు. పేపర్‌ 1 అందరికీ కామన్‌గా ఉంటుంది. పేపర్‌ 2 మాత్రం అభ్యర్థులు ఎంపిక చేసుకున్న విభాగానికి సంబంధించింది. ఇందులో నెగిటివ్‌ మార్కుల విధానం లేదు. 

సిలబస్‌

  • పేపర్‌–1లో టీచింగ్‌ అప్టిట్యూడ్, రీసెర్చ్‌ అప్టిట్యూడ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్‌(మ్యాథ్స్‌తో కలిపి), లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్, గవర్నెన్స్, పాలిటీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితర పది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 5 ప్రశ్నలు–10 మార్కులకు అడుగుతారు. అంటే.. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. n పేపర్‌–1లో అభ్యర్థుల తార్కిక సామర్థ్యం, పఠన, గ్రహణశక్తి, సాధారణ అంశాల పట్ల అభ్యర్థులకు ఉన్న అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. 

పేపర్‌–2
అభ్యర్థి పీజీలో చదివి, ఎంపిక చేసుకున్న సబ్జెక్టుపై పేపర్‌ 2 ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

లాస్ట్‌మినిట్‌ ప్రిపరేషన్‌

  • ఇది జాతీయ స్థాయి పరీక్ష. పోటీ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించడం ద్వారా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. 
  • రివిజన్‌: ప్రస్తుత సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే.. కొత్త టాపిక్స్‌కు ఎక్కువ టైమ్‌ పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్త అంశాలను చదవడం ప్రారంభిస్తే.. అవి అర్థంకాక ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికే చదివి పట్టు సాధించిన టాపిక్స్‌ను మళ్లీ మళ్లీ రివిజన్‌ చేసుకోవాలి. అలాగే ప్రిపరేషన్‌లో సమయంలో తయారు చేసుకున్న షార్ట్‌నోట్స్‌ను అనుసరించడం మేలు.
  • మాక్‌ టెస్ట్‌: పరీక్ష సమయంలో చేసే పొరపాట్లను ముందే తెలుసుకొని..వాటిని సరిదిద్దుకోవడానికి చక్కటి మార్గం..మాక్‌ టెస్ట్‌లు. పరీక్షకు ముందు మాక్‌టెస్ట్‌లు రాయడం వల్ల పరీక్ష సమయాన్ని ఏవిధంగా ఉపయోగించాలి, ఏయో అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. పరీక్షకు ముందు రోజు సమతుల ఆహారం తీసుకోవాలి.  కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రకు కేటాయించాలి. ఇలా చేయడం ద్వారా పరీక్ష కేంద్రంలో చురుగ్గా ఉండి.. ఉత్సాహంగా పరీక్ష రాసేందుకు వీలవుతుంది.
  • వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in
Published date : 16 Nov 2021 05:08PM

Photo Stories