Group1 & 2: తెలంగాణ చరిత్ర–సంస్కృతి–ఉద్యమ నేపథ్యం నుంచి 200 మార్కులు... సిలబస్ విశ్లేషణ
టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్–1, గ్రూప్–2 పోటీ పరీక్షల్లో సుమారు 200 మార్కులకు తెలంగాణ చరిత్ర–సంస్కృతి–ఉద్యమ నేపథ్యం.. విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అత్యంత కీలకమైనది, అభ్యర్థులకు సంకటంగా అనిపించే విభాగం.. తెలంగాణ చరిత్ర–సంస్కృతి ఉద్యమం నేపథ్యం. ఇందులో ప్రత్యేకంగా ఉద్యమ నేపథ్యం నుంచి 150 మార్కులు, చరిత్ర–సంస్కృతి నుంచి 50 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అత్యంత కీలకమైన సబ్జెక్ట్‌గా చెప్పొచ్చు.
Also read: Competitive Exams: కొలువు కొట్టాలంటే.. ఈ దారి పట్టాల్సిందే..!
అభ్యర్థులు ‘తెలంగాణ ఉద్యమం–మొబిలైజేషన్’.. రాష్ట్ర ఏర్పాటుకు దారితిసిన క్రమం వంటి ముఖ్యంశాలుగా చదువుకోవాలి. తెలంగాణ సంస్కృతి–వారసత్వం అనేది ఒక్క గ్రూప్స్ పరీక్షలకే కాకుండా.. ఇతర తెలంగాణ పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర అవతరణ వంటి అంశాలు సిలబస్‌లో అతి ముఖ్యమైనవి భావించాలి.
also read: Groups Syllabus: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ రద్దు.. సిలబస్‌లో కీలక మార్పులు..?
గ్రూప్–1 మెయిన్స్ సిలబస్
1. తెలంగాణ చరిత్ర–సంస్కృతి వారసత్వం (50 మార్కులు–2వ పేపర్)
2. తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర అవతరణ(150 మార్కులు–6వ పేపర్) –ఇదే పేపర్ గ్రూప్–2లో 4వ పేపర్‌గా 150 మార్కులకు ఉంది.
ప్రత్యేక అంశాలు..
1. ది ఐడియా ఆఫ్ తెలంగాణ(1948–1970)
2. ది మొబిలైజేషన్ ఫేజ్(1971–1990)
3. టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్(1991–2014)
భారత స్వాతంత్ర ఉద్యమంలో మితవాద 1885–1905, అతివాద 1905–1920, గాంధీయుగం 1920–1947.. అనే మూడు దశలు ఉన్నట్లే.. తెలంగాణ ఉద్యమం చరిత్రలో కూడా మూడు దశలు ఉన్నాయి.
also read: పోటీ పరీక్షల్లో భారతదేశ చరిత్రకు ఎలా సిద్ధమవ్వాలి?
గ్రూప్–2 సిలబస్
- పేపర్2లో తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర: ఈ విభాగం నుంచి సుమారు 50 మార్కులు వస్తాయి.
- పేపర్ 4లో తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర అవతరణ(150 మార్కులు) అంశాలు ఉంటాయి.
సిలబస్ విశ్లేషణ
తెలంగాణ చరిత్ర–సంస్కృతి
- తెలంగాణపై దండెత్తి వచ్చిన విభిన్న జాతులతో సంపర్కం ఏర్పరుచుకొని.. తన అవగాహన శక్తి పెంచుకొని, పరిణామం పొందుతూ, విశాల దృక్పథాన్ని సంతరించుకొనుట తెలంగాణ సంస్కృతి విశిష్ట లక్షణం. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను గమనిస్తే.. ఏకత్వం, సంయోగం, సామరస్యం, ప్రాచీన సంప్రదాయ విలువలు, భిన్నత్వంలో ఏకత్వంగా వర్ధిల్లుతుంది.
- శాతవాహనుల నుంచి నిజాం రాజుల వరకూ.. రాజకీయంగా, సామాజికంగా, సంస్కృతి పరంగా ఒక వేదికగా నిలుస్తుంది. శాతవాహనుల బౌద్దతత్వం, ఇక్ష్వాకుల శిల్పకళా నైపుణ్యం, విష్ణుకుండినుల సామాజిక నిర్మాణం, కాకతీయుల తటాక నిర్మాణాలు, రేచర్ల వెలమరాజుల సాహిత్య పోషణ, (2వ సింగభూపాలుడు తెలంగాణ శ్రీకృష్ణదేవరాయులుగా ప్రసిద్ధి), గోల్కొండ రాజుల తెలుగు సాహిత్య పోషణ(గోల్కొండ రాజ్యం వజ్రాల మార్కెట్‌కు ప్రపంచంలోనే గొప్ప పేరు గడించింది). ఫ్రెంచి జాతీయుడు టావెర్నియర్.. ఈ రాజ్యాన్ని ఏడు సార్లు సందర్శించినట్లు తన గ్రంథంలో రాసుకున్నాడు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిది. అన్ని జాతులకు,మాతాలకు ఒకే నిలయంగా అందరికి ఒకే ఆలయంగా తెలంగాణ నిలిచింది.
Also read: TS Police Exams - సిలబస్ వివరాలు... టాపిక్స్... విశ్లేషణ
సంస్కృతి–వారసత్వం
- సాధారణంగా మంచి అభిరుచులు, ఉత్తమ పద్ధతులు, నడవడిక, ఉన్నత ప్రవర్తనా సముదాయాన్ని సంస్కృతి అంటాం. మంచి గుణాలున్న వారిని సంస్కారం గల వారిగా పిలుస్తాం.
- ఉదా.. భవనాలు: చౌమహాల్ ప్యాలెస్, ఫలక్‌నుమా, కింగ్‌కోటి, కోటి బ్రిటిష్ రెసిడెన్సీ. కోటి బ్రిటిష్ రెసిడెన్సీని మహిళా కళాశాలగా మార్చారు. ఇది ఉస్మానియ విశ్వవిద్యాలయంలో భాగంగా ఉంది. అలాగే చౌమహాల్ అంటే నాలుగు భవనాలు అన్ని అర్థం.
- కట్టడాలు: గోల్కొండ కోట, ఓరుగల్లు కోట, చార్మినార్ (ఇది ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా నిర్మించిన కట్టడం), కుతుబ్‌షాహీల సమా«ధులు, పైయిగా సమా«ధులు, మక్కా మసీదు∙మొదలగునవి.
- ఉద్యానవనాలు: హైదరాబాద్, మూసారాంబాగ్, ఓరుగల్లు మొదలైనవి.
- పేయింటింగ్స్: పిల్లలమర్రి ఎరకేశ్వరాలయంలో ఉన్న పేయింటింగ్స్. కండూరి చోడుల కాలంలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. వీరు కాకతీయుల సామంతులు.
- రామప్ప దేవాలయంను ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. వీటిలో ఆయా కాలాలకు సంబంధించిన గొప్ప చిత్ర కళలు మనం చూడొచ్చు. ఎర్రకోట, మొగల్ గార్డెన్, తాజ్ మహాల్.. మొగల్ సంస్కృతికి చిహ్నాలుగా ఎలా భావిస్తామో.. అలాగే హైదరాబాద్‌లోని కట్టడాలన్నీంటిని తెలంగాణను పరిపాలించిన రాజులు–వారి చిహ్నాలుగా భావించాలి.
Also read: టెట్‌లో 120+ మార్కులు గ్యారంటీ కొట్టే మార్గం ఇదే.. || TET Best Preparation Tips, Books, Syllabus
వార సత్వం
ఒక జాతి, ప్రజల ఆచార వ్యవహారాలు, మత పద్దతులు, జీవన విధానమే సంస్కృతి. ఈ సంస్కృతి వారసత్వంగా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తుంది. సాంఘిక వ్యవస్థ, కళలు, సాహిత్యం, మతం, ఆచార వ్యవహారాలన్నింటిని కలిపి వారసత్వం–సంస్కృతిగా చెప్పవచ్చు.
Also read: Groupsలో ఎక్కువగా Weightage ఉన్న Subjects ఏవి..?
ది ఐడియా ఆఫ్ తెలంగాణ(1948–1970)
- ఈ దశలో అభ్యర్థులు చారిత్రక నేపథ్యం, కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాలు, భాషలు, మాండలికాలు, జాతరలు, పండగలు.. తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలపై దృష్టి కేం ద్రీకరించి.. ముఖ్యంశాలను నోట్ చేసుకోవాలి. ఉదా.. చారిత్రక నేపథ్యంలో.. ప్రధానంగా శాసనాలు.. వాటిలోని ప్రధానాంశాల గురించి తెలుసుకోవాలి.
- కాకతీయుల కాలంలో.. ఏ శాసనంలో.. నీటిపాతం, వర్షపాతం గురించి వివరాలు పొందుపర్చారు. అలాగే చెరువుల నిర్మాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలిపే శాసనం ఎక్కడ ఉంది వంటి వాటిని అత్యంత ముఖ్యమైనవిగా భావించాలి. వీటిని చరిత్ర, భౌగోళికాంశాలు, సామాజికాంశాల కోణంతో ఒకే ప్రశ్నగా రూపొందించవచ్చు.
- 1948 సంవత్సరంలో హైదరాబాద్‌పై పోలిస్ చర్య(గొడ్దార్డ్ ప్లాన్). మిలిటరీ పాలనలో ప్రజల తిరుగుబాటు, బూర్గుల రామకృష్ణరావు సారధ్యంలో మంత్రివర్గ ఏర్పాటు(ముల్కి నిబంధన ఉల్లంఘన వాటి పర్యవసానాలు), 1953లో ఫజల్ అలీ సారధ్యంలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ(ఎస్‌ఆర్‌సీ) కమిషన్ ముఖ్యంశాలు, సిఫార్సులు ముఖ్యమైనవిగా భావించాలి.
- 1956 పెద్దమనుషుల ఒప్పందం, జరిగిన మూడు సమావేశాలు(ఫిబ్రవరి, జులై, ఆగస్టు), అందులోని ముఖ్యాంశాలు, తెలంగాణ రక్షణల ఒప్పంద ఉల్లంఘన, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (ఈ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది). ఈ ఉద్యమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావుల పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
- మధన్ మోహన్ ఆధర్వర్యంలో 1969లో తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భావం, కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వలసలు, వాటి పర్యవసానాలు అధ్యయనం చేయాలి.
Also read: Competitive Examsలో మహిళలకు ఉన్న లాభాలు
సమీకరణ దశ (1971–90)
- ముల్కీ ఉద్యమ నేపథ్యం నుంచి 2001 వరకు గల గిర్‌గ్లాని కమీషన్ వరకూ.. వాటి మూలాలను చదవాల్సి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా వివిధ కమిటీలు, హైకోర్టు తీర్పులు, జీవోలు, సుప్రీంకోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం వంటివి అత్యంత కీలకంశాలుగా అభ్యర్థులు భావించాల్సి ఉంటుంది. ఉదా.. జీవో నెంబర్ 111, జీవో 610, జీవో 564, జీవో నెం 36 ప్రాధాన్యతలు వంటివి ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంది.
- నక్సలైట్ ఉద్యమం, సామాజిక ఆర్థిక నేపథ్యం.. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, వారితో చర్చలు మొదలైనవి. అలాగే ప్రస్తుత నక్సలిజం తీరుతెన్నులను సమకాలీన అంశాలతో జోడించి రాసుకోవాలి.
- రైతు కూలి, గిరిజన, ఆదివాసీల తిరుగుబాట్లను.. భార తీయ, తెలంగాణ, సామాజిక నేపథ్యంలోని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.
- 1980లో వచ్చిన ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులు, తెలుగుజాతి భావనలు, తెలంగాణ ఆత్మగౌరవం, భాషాసంస్కృతులను తెలుసుకోవాలి. వీటి నుంచి లోతైన ప్రశ్నలను సందించే ఆస్కారం ఉంటుంది.
- 1990లో ప్రపంచీకరణ పేరుతో ఉద్యోగ, పరిశ్రమ, విద్యఛ్చక్తి తదితర రంగాల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
Also read: Group - 1, 2 & 3 అర్హతలు ఏమిటి? ATO పోస్ట్ కి డిగ్రీ అర్హత సరిపోతుందా ?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా (1991–2014)
ప్రతి చాప్టర్ నుంచి 50కి మించి ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులకు కేవలం చరిత్రపై అవగాహన ఒక్కటే ఉంటే సరిపోదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, భౌగోళిక అంశాలను బేరిజు వేసుకుంటూ.. నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. 2011 అనంతరం 11 ఏళ్ల సుధీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగ ప్రకటన రానున్న నేపథ్యంలో పోటీ తీవ్రస్థాయిలో ఉండనుంది. దీనికి తోడు ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగాలు మాత్రం వందల్లోనే!! కాబట్టి సమయం వృథా చేయకుండా ప్రణాళికతో చదువుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా ఉద్యోగమే జీవిత లక్ష్యం కాకూడదు. జీవిత గమ్యం గుర్తుంచుకొని ముందుకు సాగాలి.
డా.మురళి పగిడిమర్రి,
సబ్జెక్ట్ నిపుణులు