TS High Court : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఈ కేసును..
ఇందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో.. మూడు వారాలు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది.
☛ TSPSC Exam Schedule 2023 : ఈ ఆరుకు.. మళ్లీ రాత పరీక్షలు..! అలాగే హాల్ టికెట్లలను కూడా..
6 ఎగ్జామ్స్‌ను రద్దు.. 5 లక్షల మంది..
'మొత్తం 6 ఎగ్జామ్స్‌ను రద్దు చేశారు. 5 లక్షల మంది వివిధ పరీక్షలకు అప్లై చేశారు. మూడున్నర లక్షల మంది సివిల్స్ రాశారు. 25 వేల మంది ప్రిలిమ్స్‌లో సెలెక్ట్ అయ్యారు. మార్చి 18వ తేదీన ఐటీ మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వాఖ్యలు చేశారు. ఇద్దరు మాత్రమే పేపర్ లీక్ చేశారు అని ఆయన ఎలా చెప్తారు? ఒక మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? పోలీస్ కాకుండా, సిట్ కాకుండా మినిస్టర్ ఎలా ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్తారు? ఒకే మండలం నుంచి 20 మంది టాప్ స్కొరర్లు గా ఉన్నారు. వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల మార్కులు పొందపరచలేదు. చాలా మందికి మార్కుల రూపంలో ఫేవర్ చేశారు. అని' పిటిషనర్ తరఫు న్యాయవాది వివేక్ వాదనలు విన్పించారు.
☛ TSPSC Paper Leak 2023 : టీఎస్‌పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా రద్దు..?
హైప్ కోసం ఇలాంటి పిటిషన్‌లు..
'ఈ కేసు విచారణను సిట్ పారదర్శకంగా చేస్తుంది. సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పిటిషన్ వేసిన వాళ్లకు ఈ ఎగ్జామ్ కాన్సిల్‌తో సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ వేశారు. పిటిషన్‌కు లోకస్ స్టాండ్ లేదు కాబట్టి పిటిషన్‌ను డిస్మిస్ చేయాలి. హైప్ కోసం ఇలాంటి పిటిషన్ లు వేయడం కామన్ అయిపోయింది. పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో సిట్ 9 మందిని అరెస్ట్ చేసింది. సిట్ కొన్ని మండలాలకు సైతం వెళ్లి విచారణ చేస్తుంది. 18 నుంచి 23 వరకు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. పబ్లిక్ డిమాండ్ మేరకే పరీక్షలు రద్దు చేశాం.' అని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.