Skip to main content

TSPSC Exam Schedule 2023 : ఈ ఆరుకు.. మళ్లీ రాత ప‌రీక్ష‌లు..! అలాగే హాల్‌ టికెట్లల‌ను కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వాయిదా వేసిన పరీక్షల నిర్వ‌హ‌ణ‌పై కసరత్తు ముమ్మరం చేసింది. కొశ్చ‌న్ పేప‌ర్ లీకేజ్ కార‌ణంగా.. ఇప్పటివరకు రద్దు చేసిన పరీక్షలు, వాయిదా వేసిన పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.
tspsc exam timetable 2023 telugu news
TSPSC exam schedule 2023 Details

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఇదివరకే నిర్వహించిన నాలుగు పరీక్షలు రద్దు కాగా... మరో రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేసింది.ఈ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు ఎలాంటి విధానాలను అనుసరించాలనే అంశంపై ఇప్పటికే పలు రకాల సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అతి త్వరలో ఈ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పరీక్షల నిర్వహణ విషయంలో సమూల మార్పులు చేయనున్నట్లు కమిషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

హాల్‌ టికెట్లు విష‌యంతో మ‌ళ్లీ..

tspsc exam details in telugu

టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు ఏడు అర్హత పరీక్షలను నిర్వహించింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన కమిషన్‌.. వరుసగా ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను కూడా రద్దు చేసింది. మార్చి 12వ తేదీన‌ జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్షను వాయిదా వేయగా... మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను సైతం వాయిదా వేసింది. దీంతో ఆరు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ తిరిగి నిర్వహించాల్సి వస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల వద్ద హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలు ఉన్నాయి. 

కొత్తగా పరీక్షా కేంద్రాలను..

tspsc latest news telugu

అయితే వీటన్నింటినీ సమూలంగా మార్చి కొత్తగా పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహించే వారం రోజుల ముందు కొత్త నంబర్లతో అభ్యర్థులకు తిరిగి హాల్‌ టిక్కెట్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే అభ్యర్థులకు కొత్తగా పరీక్షా కేంద్రాలు కేటాయించనున్నారు. కొత్త ప్రశ్నపత్రాలను కూడా రూపొందించనున్నారు. కమిషన్‌ రహస్య కంప్యూటర్లలోని సమాచారం బయటకు లీక్‌ కావడంతో అన్ని రకాల ప్రశ్నపత్రాలు సమూలంగా మారనున్నాయి. ఈ మేరకు కొత్త ప్రశ్నలతో ప్రశ్నపత్రాల తయారీకి నిపుణులకు సూచనలు అందినట్లు సమాచారం.

అత్యంత గోప్యంగా..
కాగా ప్రశ్నపత్రాల్లో జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరించే అంశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత పరీక్షల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అత్యంత గోప్యంగా ఈ ప్రక్రియ నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Published date : 21 Mar 2023 12:15PM

Photo Stories