కాగజ్‌నగర్‌టౌన్: గ్రూప్– 2 పరీక్ష వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
గ్రూప్ – 2 పరీక్ష వాయిదా వేయాలి
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆగస్టు 9న విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వరుస పోటీపరీక్షల షెడ్యూల్‌తో లక్షలాదిమంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని, వారి విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయాలన్నారు.
గృహలక్ష్మి దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించాలని, రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుపేదలకు ఇంత తక్కువ గడువులో దరఖాస్తు చేసుకోవడం ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి అర్షద్ హుస్సేన్, నాయకులు ప్రవీణ్ కుమార్, నక్క మనోహర్ పాల్గొన్నారు.