TS TET Results 2022 Postponed : టీఎస్ టెట్ ఫలితాలు వాయిదా.. కారణం ఇదేనా..?
టెట్ నోటిఫికేషన్‌లోనే జూన్ 27వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అలాగే టెట్ కన్వీనర్ రాధారెడ్డి కూడా జూన్ 27 తేదీనే విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల ఆలస్యం అవుతుందని, త్వరలోనే ఫలితాల తేదీన వెల్లడిస్తామని కన్వీనర్ తెలిపారు. టెట్‌ను జూన్ 12వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. టెట్ పరీక్ష పేపర్–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జరిగింది. అలాగే పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరిగింది. ఈ పరీక్షకు 90 శాతం మంది హాజరయ్యారు. టెట్ పూర్తైన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ టెట్-2022 ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.
టీఎస్ టెట్-2022 రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)
How to Check TS TET 2022 Results?
☛ Visit direct link available on sakshieducation.com
☛ Enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen
☛ Download a copy of the score card for further reference
టెట్ పేపర్–1కు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో టెట్ పేపర్–1 & 2 పరీక్షలను నిర్వహించారు. టెట్ పేపర్–1కు 3,51,468 మంది దరఖాస్తు చేసుకోక.. 3,18,506 (90.62శాతం) మంది హాజరయ్యారు. అలాగే పేపర్–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకోక.. 251,070(90.35శాతం) మంది హాజరయ్యారు.
➤ TS TET 2022 Paper-1 Question Paper & Key (Click Here)
➤ TS TET 2022 Paper-2 Question Paper & Key (Click Here)
పేపర్–2 రాసిన వారు..
వాస్తవానికి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్–2 రాసే వారు కూడా పేపర్–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు.
Also Read: 9,168 Group-4 Posts: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4కు కొత్త సర్వీస్ రూల్స్ ఇవే..! సిలబస్ మాత్రం..
ఇటీవలే ఉద్యోగాల భర్తీకి..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ భర్తీకి ప్రకటన చేయగా.. టీచర్ పోస్టులున్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 పోస్టులు, 6,500 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2000, ల్యాంగ్వేజ్ పండిట్ పోస్టులు 600 వరకు ఉన్నాయి. వీటి భర్తి నేపథ్యంలో టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.