Skip to main content

9,168 Group-4 Posts: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4కు కొత్త సర్వీస్‌ రూల్స్ ఇవే..! సిల‌బ‌స్ మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌–4 కొలువులకు కొత్తగా సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది.
TSPSC Group 4 Posts
TSPSC Group 4 Posts Rules

రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయనుంది. ఇది వరకు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్‌ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీసు నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగులు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొత్త నిబంధనలు ఆధారం కానున్నాయి.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అన్ని ఒకే సారి భ‌ర్తీతో..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్‌–4 ఉద్యోగాలను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్‌–4 కేటగిరీలో అత్యధికం జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకాలు చేపడుతుండటంతో ఉమ్మడి అంశాలకు తగినట్లుగా సర్వీసు నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నియామకాల సమయంలో సాధారణ నిబంధనలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనుండగా శాఖలవారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కామన్‌ సర్వీస్‌ రూల్స్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం... అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల వివరాలను సేకరిస్తోంది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స‌మ‌గ్ర స‌మాచారం కోసం క్లిక్ చేయండి

4–5 రోజుల్లోనే..
సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మరికొన్ని శాఖల ఉన్నతాధికారులతో రెండ్రోజులుగా సమీక్షిస్తున్నారు. శాఖాధిపతుల నుంచి సమాచారం సేకరించినప్పటికీ లిఖితపూర్వక ఆధారాలను స్వీకరించాక ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సీఎస్‌ తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు 4–5 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్నాయి. అవి అందిన వెంటనే సమీక్షించి గ్రూప్‌–4 నూతన సర్వీసు రూల్స్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయి.

ఈ సర్వీసు రూల్స్‌తో..
ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన సర్వీసు రూల్స్‌లో ఉన్న లొసుగులతో స్థానికులకు తీవ్ర అన్యాయమే జరిగింది. ఉద్యోగ నియామకాల సమయంలో కోటా ప్రకారం నియమితులైనప్పటికీ పదోన్నతుల్లో స్థానిక ఉద్యోగులు వెనుకబడిపోయారు. పదోన్నతుల ఖాళీలను మెరిట్‌ ప్రకారం భర్తీ చేసినప్పటికీ జనరల్‌ కేటగిరీలోని ఖాళీలను ఇష్టానుసారంగా ప్రమోట్‌ చేయడంతో స్థానిక కోటా ఉద్యోగులు నష్టపోయారు.

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

95 శాతం ఉద్యోగాలు..
ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్‌ విధానంలో స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులతోనే భర్తీ కానున్నాయి. అలాగే ఓపెన్‌ కేటగిరీలోని 5 శాతం పోస్టుల్లోనూ స్థానికులకు వాటా దక్కనుంది. దీంతో మెజారిటీగా స్థానికులే ఉంటారు. ఫలితంగా ఉద్యోగుల పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కల్పనలో స్థానికులకే ఎక్కువ లబ్ధి కలగనుంది. తాజాగా రూపొందుతున్న కొత్త సర్వీసు రూల్స్‌తో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన గజిబిజికి ఇక తెరపడినట్లే. మరోవైపు సర్వీసు రూల్స్‌ ఖరారయ్యాక గ్రూప్‌–4 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వెంటనే ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం నుండి నియామక ఏజెన్సీకి స్పష్టమైన ఆదేశాలతో బాధ్యతలు సైతం అప్పగించనుంది.

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

భ‌ర్తీ చేయ‌నున్న‌ గ్రూప్‌-4 ఉద్యోగాలు : 9,168  

సిల‌బ‌స్‌..

పేపర్-1 (మార్కులు 150) :

Group4


➤ జనరల్ నాలెడ్జ్
➤ వర్తమాన వ్యవహారాలు
➤ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
➤ నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం
➤ పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ
➤ భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు
➤ భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు
➤ భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
➤ జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
➤ తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
➤ తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు

పేపర్ -2 (మార్కులు 150) : 

Group 4 Exam Syllabus


☛ పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
☛ మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్)
☛ లాజికల్ రీజనింగ్
☛ కాంప్రహెన్షన్
☛ రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్
☛ న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

Published date : 24 Jun 2022 02:46PM

Photo Stories