TS TET 2022 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
జూన్ 12వ తేదీన టెట్‌ను నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.
టెట్ నోటిఫికేషన్ కోసం..
బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. టెట్‌లో అర్హత సాధిస్తే టీఆర్టీ రాయవచ్చని నిరీక్షిస్తున్నారు. వాస్తవంగా గత అయిదేళ్ల నుంచి టెట్ నిర్వహించలేదు. టెట్ పేపర్– 1, పేపర్– 2లో అర్హత సాధించినవారి కంటే టెట్ క్వాలిఫై కాని, 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసినవారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు టెట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టెట్ మోడల్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
పరీక్ష రెండు మాధ్యమాల్లో..
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించవచ్చని అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేసే అవకాశం ఉండడంతో నియామక పరీక్ష రెండు మాధ్యమాల్లో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బీఎడ్ పూర్తి చేసినవారి సంఖ్యే అధికంగా ఉంది.
TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..
టీచర్ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!