Telangana TET 2022: టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు హెచ్చరిక.. ఇవి తప్పనిసరిగా పాటిచాల్సిందే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి టెట్ నిర్వహిస్తున్నారు.దీని కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పేపర్–1కు 3,51,468 మంది, పేపర్–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. టీఎస్ టెట్ -2022 ఫలితాలను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.
టెట్‌లో 120+ మార్కులు గ్యారంటీ కొట్టే మార్గం ఇదే.. ||TET Best Preparation Tips, Books, Syllabus
ఈసారి పేపర్–2 రాసే వారు..
వాస్తవానికి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్–2 రాసే వారు కూడా పేపర్–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్–1కు దరఖాస్తులు భారీగా వచ్చాయి.
TS TET 2022 Preparation Tips : టెట్‌లో ఉత్తమ స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలోనూ అది కలిసొస్తుందా?
ప్రతీ పరీక్ష కేంద్రంలో..
టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజ ధానిలో మొత్తం 50,600 మంది పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలున్నా యి. ఈ జిల్లాలో దాదాపు 2,200 మంది పరీక్ష రాస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ప్రశ్నపత్రం ఓపెన్ చేయడం మొదలు కొని, ప్యాక్ చేసే వరకూ వీడియో రికార్డింగ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు పరీక్షను పర్యవేక్షించనున్నారు. పరీక్షాకేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపై జూన్ 10వ తేదీ (శుక్రవారం) ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. పరీక్షాకేంద్రాల చిరునామాలు సక్రమంగా లేవని, అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫొటోలు, సంతకాలు ముద్రితం కాలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో తగిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను విద్యామంత్రి ఆదేశించారు.
- TET Exam 2022: Inclusive Education అంటే ఏమిటి?
- TS TET 2022లో Child development విభాగం ఎలా చదవాలి?
- TETలో కీలక అంశమైనా Learning Chapterని ఎలా చదవాలి?
ఇవి గుర్తుంచుకోండి.. ఎందుకంటే..?
☛ టెట్ పరీక్ష పేపర్–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకూ ఉంటుంది. పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకూ ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు.
☛ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు హాలులోకి అనుమతించరు. వాటిని ముందే పరీక్షాకేంద్రంలో సూచించిన ప్రదేశంలో భద్రప ర్చుకోవాలి.
☛ ఓఎంఆర్ షీట్‌పై సర్కిల్స్ నింపేందుకు బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను ఉపయోగించాలి. ఓఎంఆర్ షీట్‌ను ముడవడం, చించడం చేయ కూడదు. దీనివల్ల కంప్యూటర్ మార్కులను తీసుకునే అవకాశం ఉండదు.
☛ హాల్‌టికెట్లపై అభ్యర్థి, అధికారుల సంతకం, అభ్యర్థి ఫొటో లేకపోతే గెజిటెడ్ అధికారి సమ క్షంలో ఫొటో అంటించి, ధ్రువీకరణ తీసుకుని, డీఈవో ద్వారా అనుమతి పొందాలి.
రెండు పేపర్లుగా..
- టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్, తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులను అర్హులుగా పేర్కొన్నారు.
- టెట్–పేపర్–1: టెట్ పేపర్–1ను ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు అంటే ఎస్‌జీటీ పోస్ట్‌లకు ప్రామాణికంగా నిర్వహిస్తున్నారు.
- పేపర్–1: ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
- 2015 డిసెంబర్ 23 తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకుని ఉంటే..ఆ పరీక్షలో 45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు బీఈడీ లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
- ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం–బీఈడీ అభ్యర్థులను కూడా ఎస్‌జీటీ పోస్ట్‌లకు అర్హులుగా పేర్కొనడంతో వీరికి కూడా టెట్–పేపర్–1కు అర్హత లభించింది. వీరు టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో విజయం సాధించి, ఉద్యోగం సొంతం చేసుకుంటే.. ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ఆరు నెలల వ్యవధిలోని బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.
-
Model papers
పేపర్–2 అర్హత ఇలా..
- ఆరు నుంచి పదో తరగతి వరకు ఆయా సబ్జెక్ట్‌లను బోధించేందుకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీకి ప్రామాణికంగా టెట్ పేపర్–2ను నిర్వహిస్తారు.
- బీఏ/బీఎస్సీ/బీకాంలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో ఉత్తీర్ణత ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏబీఈడీ/బీఎస్సీ బీఈడీలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. (లేదా) బీఈ/బీటెక్‌లో 50 శాతంతో ఉత్తీర్ణత సాధించి బీఈడీ/బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుతున్న వారు కూడా అర్హులు
- లాంగ్వేజ్ టీచర్ అభ్యర్థులు సంబంధిత లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీతోపాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్‌తో బీఈడీలో ఉత్తీర్ణులవ్వాలి.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్ పేపర్లకు హాజరు కావచ్చు. కానీ తదుపరి దశలో ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) నిర్వహించే నాటికి డీఈడీ లేదా బీఈడీలలో ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీకి అర్హత లభిస్తుంది.
టెట్ పరీక్ష స్వరూపం..
- టెట్ పేపర్–1, పేపర్–2లను 150 మార్కులు చొప్పున నిర్వహిస్తారు.
- టెట్–పేపర్–1 ఇలా: రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో అయిదు విభాగాలుగా ఉంటుంది. అవి..
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2 | లాంగ్వేజ్1 | 30 | 30 |
3 | లాంగ్వేజ్ 2(ఇంగ్లిష్) | 30 | 30 |
4 | గణితం | 30 | 30 |
5 | ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ | 30 | 30 |
మొత్తం | 150 | 150 |
- లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
- ఒకటి నుంచి అయిదో తరగతి బోధించాలనుకునే డీఈడీ, బీఈడీ అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ పేపర్–1లో అర్హత సాధించాలి.
టెట్ పేపర్–2 స్వరూపం..
ఆయా సబ్జెక్ట్‌లలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు ప్రామాణికంగా పేర్కొనే టెట్ పేపర్–2ను కూడా నాలుగు విభాగాలుగా,150మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్ కూడా పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. వివరాలు..
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2 | లాంగ్వేజ్1 | 30 | 30 |
3 | లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) | 30 | 30 |
4 | సంబంధిత సబ్జెక్ట్ | 60 | 60 |
మొత్తం | 150 | 150 |
- నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో.. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.
- సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, పెడగాజి నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున ప్రతి సబ్జెక్ట్ విభాగం నుంచి అడుగుతారు.
- సైన్స్ సబ్జెక్ట్ విషయంలో ఫిజికల్ సైన్స్ నుంచి 12, బయలాజికల్ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా ఆరు ప్రశ్నలు సైన్స్ పెడగాగీ నుంచి అడుగుతారు.
- సోషల్ విభాగంలో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్‌ల నుంచి 48 కంటెంట్ ప్రశ్నలు, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు.
- ఈ సబ్జెక్ట్ విభాగం విషయంలో రెండు అర్హతలు ఉన్న వారు తమకు ఆసక్తి ఉన్న విభాగం పరీక్ష రాసే అవకాశం అందుబాటులో ఉంది.
- లాంగ్వేజ్–1 విభాగానికి సంబంధించి టెట్ పేపర్–1 మాదిరిగానే ఆయా లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
కనీస అర్హత మార్కులు తప్పనిసరి..
రెండు పేపర్లుగా నిర్వహించే టెట్ పేపర్–1, పేపర్–2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో(90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో(75 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో (60 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికే టెట్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
TS TET 2022: సమయం తక్కువగా ఉంది... 100 మార్కులు సాధించడం ఎలా..?