Exam Preparation: టెట్ పేపర్-1లో ఈ అంశాలు పై పట్టు సాధిస్తే... విజయం మీదే!!
Sakshi Education
ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో టెట్ స్కోర్ కీలకపాత్ర పోషిస్తుంది.
టెట్ పేపర్-1కు ఎలా సిద్ధమవాలి?
- శిశు వికాసం-పెడగాజీలో శిశు వికాసం, అభ్యసనం, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వ వికాసం తదితర అంశాలు ముఖ్యమైనవి.
- టీచింగ్ ఆప్టిట్యూడ్, విద్యా దృక్పథాలపైనా దృష్టిసారించాలి.
- తెలుగులో ప్రాచీన, ఆధునిక, జానపద తెలుగు సాహిత్యం; పదజాలం, భాషాంశాలు ముఖ్యమైనవి.
- ఇంగ్లిష్‌లో టెన్సెస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్; వొకాబ్యులరీ, కాంప్రెహెన్షన్ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. గ్రామర్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
- మ్యాథమెటిక్స్‌కు సంబంధించి సంఖ్యా వ్యవస్థ, జ్యామితి, బీజగణితం తదితర అంశాలు ముఖ్యమైనవి. ప్రాక్టీస్ ద్వారా మ్యాథ్స్‌లోని అంశాలపై పట్టు సాధించొచ్చు.
ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips||DSC Best Books|| DSC Syllabus|| TET Tips... Dr. Moses
- ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో భాగంగా వృక్షాలు, జంతువులు; ఆవాసం, శక్తి వనరులు; గాలి, నీరు; మానవ శరీరం తదితర అంశాలను అప్లికేషన్ దృక్పథంతో అధ్యయనం చేయాలి.
- డీఈడీ పాఠ్యపుస్తకాల్లోని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా అనువర్తిత ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు.
- అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉమ్మడి మెథడాలజీ పాఠ్యాంశాలను గుర్తించి, వాటిపై పట్టు సాధించాలి
Published date : 29 Mar 2022 01:20PM